Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీకి పెద్ద అభిమానిని : సాక్షి సింగ్ ధోనీ

Webdunia
సోమవారం, 24 జులై 2023 (21:57 IST)
తాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు పెద్ద అభిమానిని అంటూ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ సతీమణి సాక్షి సింగ్ ధోనీ చెప్పారు. ఆమె నిర్మాతగా హరీష్ కళ్యాణ్ హీరోగా ఇవానా కథానాయికగా, నటి నదియా కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం "ఎల్జీఎం" (లెట్స్ గెట్ మ్యారీడ్). ఈ నెల 28వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. 
 
ఇందులోభాగంగా, హైదరాబాద్ నగరంలో జరిగిన ప్రమోషన్ వేడుకలో చిత్ర బృందంతో పాటు నిర్మాత సాక్షి సింగ్ ధోనీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సాధారణంగా ధోనీ ప్రతి ఒక్కరికీ సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటారు. ఇది కూడా అలాంటిదే. ఆయన నుంచి వచ్చిన మరో సర్‌ప్రైజ్. క్రికెట్ అంటే అందరూ ఎంటర్‍‌టైన్మెంట్ అనుకుంటారు. కానీ మా వారికి అది ప్రొఫెషన్. క్రికెట్ ఎలాగో సినిమా కూడా వినోదం కావడంతో తాము సినిమాల్లోకి అడుగుపెట్టాం. 
 
ఇద్దరం చాలా సినిమాలు చూస్తాం. ముఖ్యంగా, తెలుగులో అయితే, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సినిమాలు నేను చూస్తాను. నేను బన్నీకి పెద్ద అభిమానిని. ఆయన నటించిన అన్ని చిత్రాలు చూస్తుంటాను" అని సాక్షి సింగ్ ధోనీ తెలిపారు. కాగా, ఈ చిత్రాన్ని ధోనీ ఎంటర్‌‍టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరుపై తెరకెక్కించగా, తెలుగులో జేపీఆర్ ఫిలిమ్స్, త్రిపుర ప్రొడక్షన్స్ బ్యానర్లు కలిసి రిలీజ్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments