Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల ప్రేమలో మోసపోయిన "మిస్టర్ లోన్లీ"

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (15:49 IST)
Mr. Lonly team
జీవితంలో మూడు స్టేజీల్లోనూ అబ్బాయిలు ప్రేమలో మోపపోవడం ఎలా జరుగుతుందనే పాయింట్‌తో "మిస్టర్ లోన్లీష చిత్రం రూపొందింది. వీడి చుట్టూ అమ్మాయిలే అనేది ట్యాగ్ లైన్. విక్కీ, నూరజ్, కీయా, లోహిత నటీనటులుగా ముక్కి హరీష్ కుమార్ దర్శకత్వంలో కండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్ర ట్రైల‌ర్ హైద‌రాబాద్ లో విడుద‌లైంది.
 
చిత్ర దర్శకుడు ముక్కి హరీష్ కుమార్ మాట్లాడుతూ,  ముగ్గురు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఏ విధంగా మోసపోయాడు.ఆ తరువాత ఆ అబ్బాయి లైఫ్ ఏమైంది అనేదే చిత్ర కథాంశం. నిర్మాతకు నేను ఈ కథ చెప్పిన వెంటనే నన్ను నమ్మి ఈ మూవీ చేయడానికి ముందుకు వచ్చారు  సంగీత దర్శకుడు నిజాని అంజాన్ అద్భుతమైన పాటలు అందించాడు అన్నారు
 
చిత్ర నిర్మాత కండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ, నిర్మాతగా నాకిది 5 వ సినిమా అలాగే నేను 94 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గాచేయడం జరిగింది. ఈ "మిస్టర్ లోన్లీ"  సినిమా మూడు స్టేజస్ లలో జరిగే లవ్ స్టొరీ. స్కూల్, కాలేజ్‌, ఆ తరువాత ఇలా మూడు స్థాయిల‌లో ఈ సినిమా కథ నడుస్తుంది. అబ్బాయిలు ప్రేమలో మోపపోవడం జరుగుతుంది. ఇప్పటివరకు సాధారణంగా అమ్మాయిల ప్రేమలో మోసపోయిన అబ్బాయిలనే చూశాం, కానీ అబ్బాయిల చేతిలో మోసపోయిన అమ్మాయిలను మాత్రం చాలా తక్కువ మందిని చూశాం. లవ్ లో ఫెయిల్ అయి తాగుడుకు బానిసైన అబ్బాయిలే ఎక్కువ మంది ఉన్నారు. కానీ.. లవ్ ఫెయిల్ అయి తాగుడుకు బానిసైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. కరోనా నివారణకు కోవిడ్ వ్యాక్సిన్ ఎలా వచ్చిందో ఇప్పుడు మేము లవ్ వ్యాక్సిన్ ను కనిపెట్టాము. అదే మిస్టర్ లోన్లీ . సినీ ప్రేక్షకులందరూ అర్జున్ రెడ్డి,ఆర్ ఎక్స్ 100 ను ఎలా తలుచుకున్నారో ఈ సినిమా విడుదల తరువాత యూత్ అంతా మా సినిమా  "మిస్టర్ లోన్లీ" ని కూడా అలాగే తప్పకుండా తలచుకుంటారు. నాలుగు సంవత్సరాలుగా  ఎంతో కష్టపడి ఈ కథను తయారు చేసుకుని ప్రేమగా రాసి మీ ముందుకు తెస్తున్నాము. అతి త్వరలో మీ ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
 
హీరో విక్కీ మాట్లాడుతూ, ఇది నా మొదటి చిత్రం .యూత్ అందరికీ ఈ చిత్రం తప్పక నచ్చుతుంది. ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
 
 హీరోయిన్ కీయా మాట్లాడుతూ, షూటింగ్ లో చిత్ర టీం అందరూ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సినిమా లో నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అని ఆన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments