Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివర్ణపతాకంలో సోనూ సూద్ ఫోటో: సోనూ మౌంట్ కిలిమంజారో అన్నమాట!

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (14:02 IST)
Sonu Sood
దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సోనూ సూద్ కు అభిమాన గణం తయారు అయ్యారు. తాజాగా ఉమా సింగ్ అనే అభిమాని అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. సోనూసూద్‌పై తన అభిమానాన్ని వెరైటీగా చాటుకున్నాడు. సైకిలిస్ట్ అయిన ఉమాసింగ్ ఆఫ్రికాలోని కిలిమంజారో ప‌ర్వ‌తం వ‌ర‌కు సైకిల్‌పై వెళ్లాడు. అక్క‌డి నుంచి కాలి న‌డ‌క‌తో ప‌ర్వ‌తాన్ని అధిరోహించి అక్కడ భారత దేశం త్రివ‌ర్ణ పతాకంతో కూడిన పోస్ట‌ర్‌లో సోనూసూద్‌ను చూపిస్తూ రియ‌ల్ హీరో ఆఫ్ ఇండియా అని ప్ర‌క‌టించాడు.
 
ఇలా పర్వతంపై పతాకాన్ని ఆవిష్కరించడం వీడియోగా చిత్రీక‌రించి ట్వీట్ చేశాడు. ఈ వీడియోపై సోనూ సూద్ స్పందించారు. వావ్..ఇకపై నేను మౌంట్ కిలిమంజారో అన్నమాట.. చాలా గర్వంగా ఉంది ఉమ అంటూ ట్విట్ కు రిప్లయ్ ఇచ్చాడు.
 
ఉమా గురించి నేను చాలా గర్వపడుతున్నాను. అతను చాలా కష్టమైన పనిని సాధించడానికి ముందుకు వెళ్లాడు. ఈ ఘనత సాధించడానికి అతని కృషి , దృఢ సంకల్పం అతనికి సహాయపడ్డాయి. అతని మాటలతో నేను చాలా చలించిపోయాను. అతను మన యువతకు స్ఫూర్తి. ఇంత చిన్న వయసులో అతని సంకల్పం చూస్తుంటే మన భారతీయ యువత ఏదైనా చేయాలనీ మనసులో భావిస్తే.. దానిని సాధించేవరకూ నిద్రపోరని ప్రత్యక్షసాక్ష్యంగా నిలిచారని సోనూ సూద్ చెప్పారు. 
 
ప్రస్తుతం ఈ ట్విట్ రీ ట్విట్స్ తో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అయితే సోనూ సూద్ దాతృత్వానికి .. బాధితుల బంధువులు, స్నేహితులు జేజేలు పలుకుతున్నారు. సోనూ చేసిన సేవలను సాయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments