Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ లాల్ మహాభారతం.. అబుదాబిలోనే షూటింగ్ ప్రారంభం.. ఎందుకో తెలుసా?

మహాభారతంపై సినిమా తీసేందుకు మాలీవుడ్ రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భీముడి పాత్ర చుట్టూ తిరుగుతుందని.. భీమసేనగా మోహన్ లాల్ నటిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. మహాకావ్యమైన భా

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (15:14 IST)
మహాభారతంపై సినిమా తీసేందుకు మాలీవుడ్ రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భీముడి పాత్ర చుట్టూ తిరుగుతుందని.. భీమసేనగా మోహన్ లాల్ నటిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. మహాకావ్యమైన భారతాన్ని వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకుమార్ మేనన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. 
 
అయితే ఈ చిత్రం మహాభారతం మొత్తాన్ని కవర్ చేయదని.. భీముని పాత్రను మాత్రమే స్వీకరించి సినిమా చేయడం జరుగుతుందని టాక్. ఈ సినిమాకు మహాభారత అనే పేరును ఖరారు చేస్తున్నామని.. పలు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా పేరును మార్చేప్రసక్తే లేదని శ్రీకుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా అబుదాబిలో ప్రారంభించనున్నారని సమాచారం. ఇప్పటికే షెడ్యూల్స్ కూడా సినీ యూనిట్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. 
 
అబుదాబిలోనే మోహన్ లాల్ మహాభారతం షూటింగ్ ప్రారంభించాలని ఎందుకు అనుకుంటున్నారంటే.. కథ ప్రకారం బడ్జెట్ కేటాయించాల్సింది యుద్ధ సన్నివేశాలకే. మిగిలినదంతా ఎలాగూ సెట్స్ వేయక తప్పదు. అందుకే తొలుత వార్స్ సీన్లను షూట్ చేసి.. కురుక్షేత్ర సంగ్రామం తరహా లొకేషన్‌కు ఎడారి ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఎడారి ప్రాంతంలో సినిమా షూట్ చేసి అందుకు గ్రాఫిక్ వర్క్ జోడించడం సులభమని సినీ యూనిట్ అబుదాబిని ఎంచుకున్నట్లు సమాచారం.

సీఎం రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు : 50 రోజుల్లో రూ.1100 కోట్లు స్కామ్

పాయల్ కపాడియా: 30 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున కేన్స్‌లో చరిత్ర సృష్టించిన ఈమె ఎవరు?

వాయిస్ చేంజింగ్ యాప్‌ ఉపయోగించి యువతులపై అత్యాచారం ... ఎక్కడ?

ప్లీజ్... మా దేశాన్ని ఆదుకోండి.. ప్రపంచ దేశాలకు మాల్దీవులు ప్రెసిడెంట్ విన్నపం!!

థర్డ్ ఏసీనా? జనరల్ బోగీనా? రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ!!

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments