Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనేమైనా ప్రియాంకా చోప్రానా? ప్రధాని మోదీనా? ప్రియాంకా సెక్సీ కాళ్ల ప్రదర్శనపై అమితాబ్

జర్మన్ పర్యటన సందర్భంగా ప్రియాంకా చోప్రా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైనప్పుడు ఆయన ముందు కాలుపై కాలు వేసుకుని కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని క

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (14:12 IST)
జర్మన్ పర్యటన సందర్భంగా ప్రియాంకా చోప్రా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైనప్పుడు ఆయన ముందు కాలుపై కాలు వేసుకుని కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్న వేళ, తన కాళ్లు చూపిస్తూ, కాలిపై కాలు వేసుకుని కూర్చోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.
 
ప్రస్తుతం తన చిత్రం 'బేవాచ్' ప్రమోషన్ కోసం బెర్లిన్‌లో ఉన్న ప్రియాంక, మోదీని కలసి ఓ చిత్రాన్ని పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీకి ఎంతమాత్రమూ గౌరవం ఇవ్వకుండా ఆమె ప్రవర్తించిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై ప్రియాంకా చోప్రా ధీటుగా స్పందించారు.
 
తన తల్లితో కలసి కూర్చున్న చిత్రాన్ని పోస్టు చేస్తూ, "లెగ్స్ ఫర్ డేస్" అని ఒకే ఒక్క మాటతో విమర్శకుల నోళ్లు మూయించింది. ప్రియాంక పోస్టు చేసిన ఫోటోలో, ఆమె తల్లి మధు చోప్రా, ప్రియాంక కన్నా పొట్టి దుస్తులతో ఉండగా, తన తల్లితో ఉండేలాగానే, మోడీ వద్దా ప్రవర్తించానన్న భావన వచ్చేలా ఆమె పెట్టిన పోస్టు విమర్శకులకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.
 
ఐతే కొందరు పాత్రికేయులు మాత్రం ఇంకా దీన్ని వదిలిపెట్టలేదు. తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను దీనిపై ప్రశ్నలు కురిపించారు. ప్రధాని మోదీ ముందు ప్రియాంకా చోప్రా అలా కాలిపై కాలేసుకుని కూర్చోవడంపై మీరేమంటారు అని అడుగ్గా... ఏవండీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేనేమైనా ప్రియాంకా చోప్రానా... లేదంటే ప్రధానమంత్రి మోదీనా... వెళ్లి వారినడగండి అని సమాధానమిచ్చారు. మరోవైపు ప్రియాంకా చోప్రా కూడా ప్రధాని ముందు అలా కాలు మీద కాలేసుకుని దిగిన ఫోటోను తన ట్విట్టర్ నుంచి డిలిట్ చేసేసింది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం