Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ లాల్ ఒడియన్ సినిమాలో రజనీ, జూ.ఎన్టీఆర్..?

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (16:48 IST)
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ఒడియన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ కోసం మోహన్ లాల్ 50 రోజులలో 20 కిలోలు తగ్గారట. అస‌లు ఒడియన్ అంటే ఓ కల్పిత జీవిగా చిత్రీకరించారు. సగం మనిషి, సగం జంతువు రూపంలో ఉండటమే కాకుండా ఈ జీవికి అతీంద్రియ శక్తులు ఉండటంతో పాటు ఈ జీవి రాత్రిపూట అడవులలో సంచరిస్తుందనేది కేరళలలోని మలబార్ ప్రాంత ప్రజల నమ్ముతారు. 
 
దీని జీవితకాలంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను నిర్మించడానికి రూ.600 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు సమాచారం. ఈ మూవీకి శ్రీ కుమార్ మీనన్ దర్శకత్వం వహిస్తుండగా ఆశిర్వాద్ సినిమాస్ బేన‌ర్ పై నిర్మితమవుతుంది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. 
 
''అవతార్'' సినిమా తరహాలో త్రీడి ఎఫెక్ట్‌తో పాటు విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుందని సినిమా యూనిట్ చెప్తోంది. ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల చేస్తుండటంతో ఆ భాషలకు సంబంధించిన నటులను గెస్ట్ రోల్ తీసుకోనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీ కాంత్, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో నటిస్తారని ఫిల్మ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్, మంజు వారియ‌ర్, శ‌ర‌త్ కుమార్‌, సిద్ధిఖీ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments