డియర్ కృష్ణ నుంచి ఎస్పీ బాలు పాడిన చివరి పాట విడుదల చేసిన మోహన్ లాల్

డీవీ
గురువారం, 24 అక్టోబరు 2024 (17:05 IST)
song releasedby mohanlal
పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా డియర్ కృష్ణ.సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ కథను దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న డియర్ కృష్ణ చిత్రంలో ప్రేమలు చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరితో పాటు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. 
 
రియల్ ఇన్స్ డెంట్స్ ను ప్రేరణగా తీసుకొని పీఎన్ బలరామ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రాసుకున్నారు. హృదయాన్ని బరువెక్కించే ఓ విషాద సంఘటన, శ్రీకృష్ణున్నే భక్తులు ఆ భారం అంతా ఆయనపై వేశారు. డాక్టర్లే ఏం చేయలేమన్న పరిస్థితుల్లో ఓ మిరకల్ జరిగింది. ఇలాంటి అద్భుతమైన కథ ఇతివృత్తమే డియర్ కృష్ణ సినిమా సబ్జెక్ట్. నమ్మలేని నిజాలు కాదు ఎవరూ ఊహించలేని స్క్రీన్ ప్లే రాసిన ఆ భగవంతుడు శ్రీ కృష్ణుని దయతోనే ఈ సినిమా నిర్మించినట్లు నిర్మాత పీఎన్ బలరామ్ పేర్కొన్నారు.
 
కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ చిరుప్రాయం పాట లాలెట్టన్ మోహన్ లాల్ గారి చేతుల మీదగా విడుదల చేశారు. లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన చివరి పాట ఇది.
 
ఈ సందర్భంగా లాలెట్టన్ మోహన్ లాల్ గారు మాట్లాడుతూ : శ్రీకృష్ణుడు చేసిన ఒక మిరకిల్ పాయింట్ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ చిరుప్రాయం నా మనసును హత్తుకుంది. లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన ఈ పాట మీ హృదయాలను కూడా హత్తుకుంటుంది. ఈ పాటలాగే సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌.. అసెంబ్లీ ఎన్నికల పోటీ

2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.. చంద్రబాబు

చొక్కాపై చట్నీ వేసాడని అర్థరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లుతో కాల్చుతూ కత్తితో పొడిచి చంపేసారు

2047 నాటికి వికసిత్ భారత్‌గా మారడానికి ఫిట్‌నెస్ కీలకం: డా. మంసుఖ్ మాండవియా

చిత్తూరు: ప్రైవేట్ కాలేజీ మూడో అంతస్థు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments