Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలీని త‌న కాళ్ళ‌మీద ప‌డేలా చేసిన మోహ‌న్‌బాబు

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (18:21 IST)
Mohan babu latest
మోహ‌న్‌బాబు ఎక్క‌డున్నా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటారు. షూటింగ్‌లోనూ ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాల‌లోనూ టైం అంటే టైమే. అప్ప‌టి ఎన్‌.టి.ఆర్‌.నుంచి పుణికిపుచ్చుకున్న క్ర‌మ‌శిక్ష‌ణ అంటూ వివ‌రిస్తుంటారు. స‌హ‌జంగా ఇంట‌ర్వ్యూల‌కు దూరంగా వుండే మోహ‌న్‌బాబు ఈటీవీలోని అలీతో స‌ర‌దాగా అనే ప్రోగ్రామ్‌కూ రాన‌ని చెప్పాడ‌ట‌. ఆఖ‌రికి వారి పిల్ల‌లు విష్ణు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న చెప్ప‌గా చెప్ప‌గా వ‌చ్చాన‌ని అలీతో వెల్ల‌డించాడు మోహ‌న్‌బాబు. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌తి ఆర్టిస్టును ఇంట‌ర్వ్యూలు చేసే క్ర‌మంలో ఓ సోఫా అందులో ఇద్ద‌రు కూర్చుని మాట్లాడుకునేట్లుగా వుంటుంది. కానీ మోహ‌న్‌బాబు త‌న ప్ర‌త్యేక‌ను నిన్న జ‌రిగిన ఎపిసోడ్‌లో చాటుకున్నారు.
 
సెప‌రేట్‌గా అట్ట‌హాసంగా వుండే కుర్చీని వేయించేలా చేశారు నిర్వాహాకులు. ఆయ‌న కారుదిగి వ‌స్తుంటే మోహ‌న్‌బాబు క‌టౌట్లు పెట్టి మ‌రీ సాద‌రంగా ఆహ్వానించారు. బ‌హుశా ఆయ‌న స్థాయికి త‌గిన‌ట్లు చేయ‌డం విశేషం. ఇక ఇంట‌ర్య్వూ మొద‌లు పెట్టాక మోహ‌న్‌బాబు త‌న నైజంతో సెటైర్ వేస్తుంటారు. అలాగే అలీని వేశారు. అలీ నీకు పొగ‌రు ఎక్కువ‌. నాకు నువ్వు చిన్నోడివే అంటూ వేలును చూపించాడు. నేను మిమ్మ‌ల్ని స‌రిగ్గానే గౌర‌వించాన‌నే అంటూ అలీ బ‌దులివ్వ‌గా, లేదు. ఆలోచించుకో.. అంటూ, మీ అమ్మ‌గారంటే నాకు గౌర‌వం. ఆమె ఎప్పుడు క‌నిపించినా నేను వంగి కాళ్ళ‌కు న‌మస్కారం పెడ‌తాను. అంటూ క్లూ ఇచ్చాడు. అది అర్థం చేసుకున్న అలీ లేచి వెళ్ళి. మోహ‌న్‌బాబు కాళ్ళ‌కు న‌మ‌స్కారం పెట్టాడు. ఆ త‌ర్వాత మా అమ్మ‌గారు కూడా మీ గురించి బాగానే చెప్పేది. పెద్ద కొడుకు అంటూ సంబోధించేది అంటూ అలీ జ‌రిగిన సంఘ‌ట‌న చెప్పుకొచ్చారు.
 
ఈ ఎపిసోడ్ 250వ ఎపిసోడ్ కావ‌డంతో మోహ‌న్‌బాబు కేక్ క‌ట్ చేశాడు. అయితే ఈ ఇంట‌ర్వ్యూ సారాంశం అసంపూర్తిగా మిగిలింది. దాంతో మ‌రో వారంలో మ‌ర‌లా సెకండ్ ఎపిసోడ్‌తో క‌లుద్దాం అంటూ ముగించారు. ఫైన‌ల్‌గా మోహ‌న్‌బాబు కుమార్తె ల‌క్ష్మీ ప్ర‌స‌న్న త‌న తండ్రి గురించి మాట్లాడుతున్న క్లిప్పింగ్ వేశారు. నాన్న‌గారికి కోపం ఎక్కువ త‌గ్గించుకోమ‌ని చెప్పండ‌ని అలీకి విన్న‌వించింది. మ‌న‌వ‌రాళ్ళ‌తో ఎంతో ఆప్యాయంగా వుంటాడు. అదే మాపై ఎందుకు చూపించ‌డంలేద‌ని ప్ర‌శ్నించింది. ఇలా స‌ర‌దాగా సాగే ఎపిసోడ్ లో మోహన్‌బాబు త‌న పుట్టిన సంవ‌త్సం 1965గా చెప్ప‌డం ప్రేక్ష‌కుల‌కు విస్మ‌యాన్ని క‌లిగించింది. ఇంకా మ‌రిన్ని విస్మ‌యాల‌ను వ‌చ్చేవారం తెలుసుకుందాం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారుపల్లి తండాలో "కంటైనర్ స్కూల్".. ఆ స్కూల్ వారికే!

ఆంధ్రప్రదేశ్ గ్రామసభకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ సర్కారు... ఏంటది?

పెళ్లి పీటలపై వరుడు చెంప పగులగొట్టిన వధువు.. ఎక్కడ?

ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదు.. కూల్చివేతలపై వెనక్కి తగ్గేది లేదు : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments