ర‌జ‌నీకాంత్ యోగ‌క్షేమాలు తెలుసుకున్న మోహ‌న్‌బాబు

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (22:56 IST)
అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డంతో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ శుక్ర‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని అపోలో హాస్పిట‌ల్స్‌లో చికిత్స నిమిత్తం చేరారు. బీపీ పెర‌గ‌డంతో ఇబ్బందిప‌డ్డ‌ ఆయ‌న ఆరోగ్య స్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ, చికిత్స అందిస్తున్న‌ట్లు హాస్పిట‌ల్ వ‌ర్గాలు ఒక అధికార ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.
 
కాగా ర‌జ‌నీకాంత్‌, మోహ‌న్‌బాబు అత్యంత స‌న్నిహిత మిత్రుల‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మోహ‌న్‌బాబు తిరుప‌తిలో ఉన్నారు. త‌న స్నేహితుడు అస్వ‌స్థ‌త‌తో హాస్పిట‌ల్‌లో చేరార‌నే వార్త తెలుసుకున్న ఆయ‌న ఆందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే ఆయ‌న యోగ‌క్షేమాలు తెలుసుకునేందుకు ర‌జ‌నీ భార్య ల‌త‌కు, కుమార్తె ఐశ్వ‌ర్య‌కు, సోద‌రికి ఫోన్లు చేశారు.
 
ర‌జ‌నీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌నీ, ఎలాంటి ఆందోళ‌నా ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌నీ వారు చెప్ప‌డంతో మోహ‌న్‌బాబు కుదుట‌ప‌డ్డారు. ర‌జ‌నీ మాన‌సికంగా, శారీర‌కంగా దృఢ‌మైన వ్య‌క్తి అనీ, ఈ అస్వ‌స్థ‌త నుంచి ఆయ‌న త్వ‌ర‌గా కోలుకుని, ఎప్ప‌టిలా త‌న ప‌నులు మొద‌లుపెడ‌తార‌నీ మోహ‌న్‌బాబు ఆశాభావం వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments