సోదరుడిని కోల్పోయాను... కలెక్షన్ కింగ్ మోహన్ బాబు

నందమూరి కుటుంబంతో సినీ హీరో మోహన్ బాబుకు ఉన్న పరిచయం, అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న హరికృష్ణ మరణవార్త మోహన్ బాబును తీవ్రంగా కలిసివేసింది.

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (13:05 IST)
నందమూరి కుటుంబంతో సినీ హీరో మోహన్ బాబుకు ఉన్న పరిచయం, అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న హరికృష్ణ మరణవార్త మోహన్ బాబును తీవ్రంగా కలిసివేసింది. ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన సోదరుడిని కోల్పోయానని, ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదన్నారు. తన జీవితంలో అత్యంత విలువైనదాన్ని కోల్పోయాను అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. హరికృష్ణ మరణంతో ఆయన కన్నీటిపర్యంతం అయ్యారు. ఇంతకుమించిన లోటు తనకు మరేదీ లేదన్నారు.
 
సినీ హీరో నందమూరి హరికృష్ణ మృతిపై జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. హరికృష్ణ ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని భావించానని, ఆ వెంటనే విషాద వార్త వినాల్సి వచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు.
 
సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని వ్యాఖ్యానించిన పవన్, హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని, తన తరపున, జనసేన శ్రేణుల తరపున ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments