Nani: మోహన్ బాబు కీలక పాత్రలో నాని ది ప్యారడైజ్ చిత్రం

దేవీ
శనివారం, 6 సెప్టెంబరు 2025 (09:00 IST)
Nani - Mohan babu
ఇండస్ట్రీలో 17 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ది ప్యారడైజ్ నుంచి నాని బీస్ట్ మోడ్ లో స్టిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా జరుగుతున్న షూటింగ్ జరుపుకుంటోంది. మరో ప్రత్యేకత ఏమంటే ఇందులో డా. మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా కాలం గేప్ తర్వాత తను నటిస్తున్న చిత్రమిది. రాజమౌళి యమదొంగ తర్వాత మోహన్ బాబు నటించింది లేదు. మరి నాని సినిమాలో పాత్ర పవర్ పుల్ గా వుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇటీవలే ఆయనపై సన్నివేశాలు కూడా చిత్రీకరించారు.
 
ప్యారడైజ్ లో నాని నెవర్ బిఫోర్ జడల్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కోసం జిమ్ లో ఇంటెన్స్ గా వర్క్ అవుట్ చేస్తున్నారని ఈ స్టిల్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, రా స్టేట్మెంట్, గ్లింప్స్ వీడియోలకు నేషనల్ వైడ్ గా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్ పై  నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
ది ప్యారడైస్ 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్  మొత్తం ఎనిమిది భాషల్లో రిలీజ్ అవుతూ ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాలలో ఒకటిగా నిలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments