వైవిఎస్ చౌదరి వద్దన్నా బ్యాంకులో వేసి బౌన్స్ చేశారు... అక్కడ తేల్చుకుంటాం: మోహ‌న్ బాబు

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (15:51 IST)
ప్ర‌ముఖ‌ న‌టుడు, నిర్మాత మంచు మోహ‌న్‌బాబుకు హైద‌రాబాద్ ఎర్ర‌మంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెష‌ల్ మేజిస్టేట్ కోర్టు ఏడాది పాటు శిక్ష‌ను ఖ‌రారు చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయన స్పందించారు. ఆయ‌న మాట్లాడుతూ ``2009లో `స‌లీమ్` సినిమా చేస్తున్న స‌మయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌద‌రికి చెల్లించేశాం. 
 
మా బ్యాన‌ర్‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికిగానూ ఆయ‌న‌కు రూ.40 ల‌క్ష‌ల చెక్ ఇచ్చాం. `స‌లీమ్` అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. వైవిఎస్ చౌద‌రితో త‌దుప‌రి చేయాల్సిన సినిమాను వ‌ద్ద‌నుకున్నాం. సినిమా చేయ‌డం లేద‌ని వైవిఎస్ చౌదరికి చెప్పాం. అలాగే చెక్‌ను బ్యాంకులో వేయ‌వ‌ద్ద‌ని కూడా చెప్పాం. అయినా కూడా కావాల‌నే చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ను బౌన్స్ చేశారు. 
 
నాపై చెక్ బౌన్స్‌  కేసుని వేసి కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. ఈ తీర్పుని మేం సెష‌న్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. కొన్ని చానెల్స్‌లో నాపై వ‌స్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను న‌మ్మ‌వద్దు`` అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments