Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ నెరవేరని కలలు.. డైరీలో అన్నీ రాసుకున్నాడు.. (video)

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (11:21 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఎన్నో కలలు కన్న సుశాంత్ అర్ధాంతరంగా తనువు చాలించి అందరికి తీరని విషాదాన్ని మిగిల్చాడు. ఆయన ప్లాన్స్, డ్రీమ్స్ ప్రస్తుతం ఒక్కొక్కటి బయటపడుతోంది. వాటిని చూసి అభిమానులు ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. సుశాంత్.. చిత్రాలలో పోషించిన పాత్రలని వివరంగా విశ్లేషించి, ప్రతి సంవత్సరంలో కొన్ని లక్ష్యాలకి సంబంధించిన జాబితా సిద్ధం చేశాడు.
 
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ తన డైరీలో 2020 నాటికి అతను సాధించాలని అనుకున్న జాబితా సిద్ధం చేశాడు. ప్రేక్షకులు మీ మీద నమ్మకం కోల్పోకుండా చేయాలి. పాత్రలని ఇష్టపడి చేయాలి. ముందుగా అర్ధం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి తనకు అనుకూలమైన ఏదో ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తూ ఉండాలి, అని నటన గురించి కొంత రాసుకున్నాడు.
 
ఇక తనలోని నటనా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం, హాలీవుడ్‌లని అగ్ర ఏజెన్సీతో అనుబంధం పెంచుకోవడం, అగ్రశ్రేణి ఆటగాళ్లతో సంబంధాలు, సినిమా, విద్య, పర్యావరణం ఇలా తాను సాధించాల్సిన లక్ష్యాలని ఓ జాబితాగా రూపొందించుకున్నాడు.
 
ముఖ్యంగా తన లక్ష్యాలలో ఆస్తి సృష్టి అనే విభాగం కింద రూ.50 కోట్ల జాబితా రెడీ చేశారు. తన ఖర్చును స్థిర ఆదాయానికి మార్చి లాస్ ఏంజిల్స్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేశాడు."విజన్" అనే విభాగం కింద, అతను ఈ సంవత్సరం నాటికి హాలీవుడ్‌లో పనిచేయాలని పక్కా ప్రణాళిక వేసుకున్నాడు. కాని అవన్నీ నెరవేర్చుకోకుండానే అర్ధాంతరంగా కన్నుమూశాడు.
 
కాగా జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ సుశాంత్‌ది ఆత్మహత్య కాదని.. హత్యేనని వాదనలు వినిపిస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు కొద్ది రోజుల ముందు మరణించిన అతని మాజీ మేనేజర్ దిషా సాలియన్ ఆత్మహత్యకు సుశాంత్ మృతికి లింకుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సుశాంత్ కేసును సీబీఐ విచారణ జరుపుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments