మహిళలు కేవలం ఇల్లాలిగా ఉంటే తప్పేంటి? నా కూతురు పెంపుడు పప్పీ కాదు: మీరా రాజ్ పుత్

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్ పుత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బిటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్‌లో పెళ్లి, సంతానం తర్వాత కరీనా కపూర్ ఖాన్ లాంటి హీరోయిన్లు తిరిగి సినిమాల్లో

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (17:17 IST)
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్ పుత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బిటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్‌లో పెళ్లి, సంతానం తర్వాత కరీనా కపూర్ ఖాన్ లాంటి హీరోయిన్లు తిరిగి సినిమాల్లో నటిస్తుంటే.. రాజ్ పుత్ మాత్రం.. గృహిణిగా ఉండటమే తనకిష్టమని చెప్తోంది.

సినీ పరిశ్రమలో వివాహం తర్వాత కూడా నటించాలనే డిమాండ్ పెరిగిపోతున్న వేళ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో మీరా రాజ్ పుత్ మాట్లాడుతూ.. తాను బాధ్యత గల గృహిణిని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతానని.. మహిళలు కేవలం ఇల్లాలిగా ఎందుకు ఉండకూడదంటూ ప్రశ్నించింది. ఈ విషయంలో ఎవరి ఆలోచనలు, అభిప్రాయాలు వారికుంటాయి. అలాగే తన ఆలోచనలు తనకున్నాయని చెప్పుకొచ్చింది. 
 
తన కుమార్తె మిషాను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చేందుకు ఎంతగానో కష్టపడ్డానని.. అలాంటి పిల్లలతో హడావుడిగా గడిపి ఉద్యోగం, పని అంటూ వారిని విడిచి వెళ్ళిపోవడం తనకు నచ్చదని వ్యాఖ్యానించింది. ఓ తల్లిగా తాను తన కుమార్తె బాధ్యతలు నిర్వర్తించాలనుకుంటున్నాను. ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉండాలనుకుంటున్నాను.

మిషా తన కన్నకూతురని.. తాను ఇంట్లో పెంచుకునే కుక్కపిల్ల కాదని వ్యాఖ్యానించింది. మీరా రాజ్ పుత్ వ్యాఖ్యలతో బిటౌన్ హీరోయిన్లంతా షాక్ తిన్నారు. ఇదేంటి.. షాహిద్ భార్య ఇలా మాట్లాడేసిందే? అంటూ చర్చించుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దుస్తులు విప్పేసి వీడియో కాల్ చేసింది, టెంప్టై వలలో పడ్డాడు, రూ.3.4 లక్షలు హాంఫట్

బాల్య వివాహం, లైంగిక దాడి కేసు.. బాలిక తండ్రి, భర్తకు జీవిత ఖైదు.. రంగారెడ్డి కోర్టు

తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి రూ.30కోట్లు.. పవన్ సిఫార్సు.. తితిదే గ్రీన్‌సిగ్నల్

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బర్త్ డే.. విమానంలో సర్ ప్రైజ్ ఇచ్చిన వైకాపా నేతలు.. మిథున్ రెడ్డి?

వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గేందుకు సాయపడే అలసందలు

కేన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్ష... ఖర్చు ఎంతంటే?

బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

2035 నాటికి భారతదేశాన్ని తలసేమియా రహితంగా మార్చడమే లక్ష్యం

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

తర్వాతి కథనం
Show comments