Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్‌కు బెల్లంకొండ సురేష్ భారీ ఆఫర్.. శ్రీనివాస్‌తో నటిస్తే రూ.2 కోట్లిస్తాడట..!?

బెల్లంకొండ శ్రీనివాస్ నాలుగో సినిమాకు రెడీ అయిపోతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తొలి రెండు సినిమాల్లో సమంత, తమన్నాలతో ఐటెంసాంగ్‌లతో చిందులేశాడు. మూడో సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా తీసుకున

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (16:37 IST)
బెల్లంకొండ శ్రీనివాస్ నాలుగో సినిమాకు రెడీ అయిపోతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తొలి రెండు సినిమాల్లో సమంత, తమన్నాలతో ఐటెంసాంగ్‌లతో చిందులేశాడు. మూడో సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఐటెం సాంగులకే సమంత, తమన్నాలకు రూ.50 లక్షల వరకు ఇచ్చుకున్నాడు.. శ్రీనివాస్ ఫాదర్, నిర్మాత బెల్లంకొండ సురేష్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న బెల్లంకొండ సురేష్.. ఈ సినిమా పూర్తి చేశాక తన కుమారుడైన శ్రీనివాస్‍తో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 
 
ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేయనున్నారని తెలిసింది. టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న కీర్తిసురేష్‌ను హీరోయిన్‌గా తీసుకుని.. ఆమెకు రూ.కోటి 70లక్షల రూపాయలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట బెల్లంకొండ సురేష్. ప్రస్తుతం కీర్తి సురేష్‌కు తెలుగులో అంత మార్కెట్ లేదు. తెలుగులో ఆమెకు కోటి రూపాయలు ఇచ్చే నిర్మాత లేడు. కానీ బెల్లంకొండ మాత్రం తన కుమారుడు సరసన నటిస్తే ఇంచుమించు రెండు కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడట. మరి ఈ ఆఫర్‌ను కీర్తి సురేష్ స్వీకరిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments