Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌కిలీ ఐడీతో మీరా చోప్రా వేక్సిన్‌; ఖ‌ండించిన చోప్రా

Webdunia
సోమవారం, 31 మే 2021 (15:39 IST)
Meera chopra (ig)
న‌టి మీరా చోప్రా `బంగారం`లో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచిత‌మే. ఆమె బాలీవుడ్‌లోనూ ప‌లు సినిమాల్లో న‌టించింది. తాజాగా ఆమె ఓ అప‌వాదును ఎదుర్కొంటోంది. న‌కిలీ ఐడీతో క‌రోనా వేక్సిన్ వేయించుకుంద‌నేది ఆరోప‌ణ‌. థానే మున్సిపాలిటీ ప‌రిధిలో జ‌రిగిన ఈ ఉదంతంపై థానే మున్సిప‌ల్ క‌మిషీన‌ర్ సందీప్ మాల‌య్యా దీనిపై విచార‌ణ జ‌రిపి రుజువైతే క్రిమిన‌ల్ కేసు పెడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.
 
వివ‌రాల్లోకి వెళితే, కోవిడ్ సెకండ్‌వేవ్ స‌మ‌యంలో ఫ్రంట్‌లైన్ వారియ‌ర్‌కు కోవాక్సిన్ వేయిస్తుంది ప్ర‌భుత్వం. ఇది థానే టిఎంసి పార్కింగ్ ప్లాజా సెంటర్‌లో "ఫ్రంట్‌లైన్ వర్కర్" ప్రాధాన్యత విభాగంలో టీకాలు వేయించుకుంద‌ట‌. థానేలోని ఓం సాయి ఆరోగ్య‌కేంద్రం సూప‌ర్‌వైజ‌ర్‌గా మీరా చోప్రా ఫేక్ ఐడీ కార్డును సృష్టించి దాని ద్వార వేక్సిన్ వేయించుకుంద‌ట‌. ఈ విష‌యాన్ని బిజెపి నాయ‌కులు క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. దీనిపై దానే మునిసిపల్ కార్పొరేషన్ విచారణకు ఆదేశించింది.
 
కాగా, తాజాగా ఈ ఆరోప‌ణ‌ల‌ను ఆమె ఖండించారు. కోవిడ్ సెండ్‌వేవ్ స‌మ‌యంలో కేంద‌ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డిలో విఫ‌ల‌మైంద‌నీ, ఆసుప్ర‌తిలో బెడ్‌లు, ఆక్సిజ‌న్‌లు లేవ‌ని స్టేట్‌మెంట్ ఇచ్చింది. అలాంట‌ప్పుడు ప్ర‌జ‌లు 18శాతం జీఎస్‌.టి. ఎందుకు క‌ట్టాల‌ని ప్ర‌శ్నించింది. జీఎస్‌.టి.ని వెంట‌నే ర‌ద్దుచేయాల‌ని డిమాండ్ చేసింది. దాని ప‌ర్యావ‌సాన‌మే ఆమెపై ఆరోఫ‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments