Mickey J. Meyer : నేను రెడీ కోసం మిక్కీ జె మేయర్ మ్యూజిక్

చిత్రాసేన్
శుక్రవారం, 31 అక్టోబరు 2025 (15:53 IST)
Mickey J. Meyer, Trinadha Rao Nakkina
నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో హవీష్, సినిమా చూపిస్తా మామా, నేను లోకల్, ధమాకా, మజాకా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన బ్లాక్ బస్టర్ మేకర్  త్రినాధ రావు నక్కినతో కలిసి కంప్లీట్ ఎంటర్‌టైనర్ 'నేను రెడీ' చేస్తున్నారు. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది.
 
మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మాస్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన, మెలోడీ కంపోజర్ మిక్కీ జె మేయర్ కలిసి పని చేయడంతో ఈ సినిమాలో మాస్, మెలోడియస్ ట్యూన్‌ల కలయికను ఆశించవచ్చు.
 
ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన నేను రెడీ అనే టైటిల్ మంచి రెస్పాన్స్ తో ఈ చిత్రంపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రానికి నిజార్ షఫీ సినిమాటోగ్రఫీన, ప్రవీణ్ పూడి ఎడిటింగ్‌ అందిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే అందించారు.
 
తారాగణం: హవీష్, కావ్య థాపర్, శ్రీలక్ష్మి, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్ రాయ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను- విశాఖపట్నంలో కూరగాయలు, సీఫుడ్స్ ధరలకు రెక్కలు

Azharuddin: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్ అజారుద్ధీన్

చిత్తూరు మేయర్ దంపతులు హత్య కేసు : ఐదుగురుకి ఉరిశిక్ష

Chiranjeevi: డీప్ ఫేక్‌పై ప్రభుత్వాలు అసెంబ్లీ చట్టాలు తీసుకురావాలి: చిరంజీవి డిమాండ్ (video)

ఏం చెట్టురా అది, ఆ చెట్టు పడిపోకూడదు, బ్రతకాలి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments