Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

Advertiesment
Havish, Kavya Thapar

దేవీ

, సోమవారం, 1 సెప్టెంబరు 2025 (14:02 IST)
Havish, Kavya Thapar
హీరో హవీష్, డైరెక్టర్ త్రినాధరావు నక్కిన క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'నేను రెడీ'. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది.
 
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక టాకీ పార్ట్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైయింది. హీరోతో పాటు ప్రధాన నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  త్రినాథరావు నక్కిన తన మార్క్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ని రెడీ చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉండబోతుంది.  
 
బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటి గణేషన్, అజయ్, మురళి గౌడ్, గోపరాజు, శ్రీకాంత్ అయ్యంగర్.. ప్రముఖనటులంతా కీలకమైన పాత్రల్లో అలరించబోతున్నారు
 
ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నిజార్ షఫీ డీవోపీ. ప్రవీణ్ పూడి ఎడిటర్. ప్రొడక్షన్ డిజైనర్ రఘు కులకర్ణి. విక్రాంత్ శ్రీనివాస్ కథ, డైలాగ్స్ అందిస్తున్నారు.
 
నటీనటులు: హవిష్, కావ్య థాపర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వి టి గణేశన్, అజయ్, ప్రదీప్ (అంతేగా), గోపరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మాణిక్ రెడ్డి, నాగ మహేష్ , సత్యనారాయణ, రచ్చ రవి, రోహన్, అనంత్ బాబు, గుండు సుదర్శన్, గుండు జీవన్, చిరాగ్ జోనీ, గౌతం రాజు, మురళీ గౌడ్, సతీబాబు, ఉదయ్ భాగవతుల, వెంకట్ రెడ్డి, రమేష్, షేకింగ్ శేషు, శ్రీలక్ష్మి, రూప లక్ష్మి, మణిచందన, మహతి, హరితేజ, రోహిణి, జయవాణి, అక్షిత, స్వప్నికా, భాగ్య, ఆశ్రిత, నర్గీస్ ఫక్రి
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది