Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Havish: రోజూకో సినిమా రిలీజ్ చేయాలనికి నేను రెడీ అంటున్న హీరో హవీష్

Advertiesment
Nenu Redy antunna Havish

దేవీ

, గురువారం, 26 జూన్ 2025 (11:34 IST)
Nenu Redy antunna Havish
నువ్విలా తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో హవీష్, ధమాకా.. దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ "నేను రెడీ". ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి బ్యానర్ పై  నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ ను ఈ రోజు హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. 
 
webdunia
Havish, Kavya Thapar, Nakkina Trinadharao
ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నిఖిల కోనేరు మాట్లాడుతూ - నేను రెడీ చిత్రంతో నిర్మాతగా అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది. మా నాన్నగారు జీనియస్, రాక్షసుడు వంటి సూపర్ హిట్స్ మూవీస్ చేశారు. విద్యారంగంలో ఎంతో సేవ చేస్తున్నారు.  ఆయన లెగసీని ముందుకు తీసుకువెళ్లాలి అనేది నా డ్రీమ్. ఇప్పటికే నేను విద్యారంగంలో నాన్న లెగసీని కంటిన్యూ చేస్తున్నాను. మిక్కీ, ప్రవీణ్, నిజార్ వంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ మా మూవీకి వర్క్ చేశారు. నేను రెడీ సినిమాతో సూపర్ హిట్ మూవీ ఇవ్వాలని అనుకుంటున్నా అన్నారు.
 
హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ - నేను రెడీ మూవీ పక్కా ఎంటర్ టైనర్. హవీష్ లాంటి మంచి హీరోతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా డైరెక్టర్ త్రినాథరావు గారు ఈ మూవీని కంప్లీట్ ఫన్ తో రూపొందించారు. ఈ రోజు మేము చూపించింది చిన్న గ్లింప్స్ మాత్రమే. మూవీలో మీకు కావాల్సినంత వినోదం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది. నేను రెడీ నుంచి రిలీజ్ చేసే ప్రతి కంటెంట్ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.
 
హీరో హవీష్ మాట్లాడుతూ, నాకు ప్రతి రోజూ ఓ సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది. కానీ లో క్వాలిటీ మూవీస్ చేయకూడదు. మంచి స్టాండర్డ్స్ లో చేయాలనుకుంటా. మంచి అవకాశాలు రావాలని రోజూ కోరుకుంటా. త్రినాథరావు గారితో ఎప్పుడో మూవీ చేయాల్సింది. కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. నేను రెడీ మూవీతో ఆ అవకాశం రావడం సంతోషంగా ఉంది. మిక్కీ మ్యూజిక్, నిజార్ విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్నారు.
 
డైరెక్టర్ నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ, ఇందులో పది సీన్స్ చేస్తే 8 సీన్స్ బాగా నవ్వుకుంటుంన్నాం. 2 సీన్స్ సెంటిమెంట్ తో ఉద్వేగానికి గురవుతున్నాం. ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్, కుటుంబం మధ్యలో ఉండే సరదాలు, ఎమోషన్స్ ..ఇవే మూవీలో ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో చాలా మంచి ఆర్టిస్టులు నాకు దొరికారు. మిక్కీ గారు చాలా మంచి సాంగ్స్ ఇస్తున్నారు. 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సినిమా అంతా ఫ్యామిలీతో కలిసి చూసేలా హాయిగా ఉంటుంది. ఇదొక ఫ్యామిలీ బొనాంజా మూవీ. ప్రేక్షకులంతా సకుటుంబంగా థియేటర్స్ కు వచ్చి 2.30 గంటలు నవ్వుకుని, చివరి 15 నిమిషాలు ఎమోషన్ ఫీల్ అయ్యి బయటకు వెళ్తారు. నిఖిల ఫస్ట్ మూవీకే ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకుంటారు. నేను రెడీ హవీష్ గారి కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది. త్వరలోనే ఈ చిత్రంతో థియేటర్స్ లో మీట్ అవుదాం. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష