Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Havish: నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరో హవీష్ చిత్రం

Advertiesment
Havish, gundu sudrshan, Trinadh rao

దేవీ

, బుధవారం, 18 జూన్ 2025 (16:07 IST)
Havish, gundu sudrshan, Trinadh rao
నువ్విలా,జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో హవీష్, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో ఓ క్రేజీ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి నిఖిల కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
ఓ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా హవీష్, నక్కిన త్రినాథరావు మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా..నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంతిక 8 వసంతాలు చేయడానికి డబ్బు అక్కర్లేదని చెప్పింది