Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

విశ్వం మూవీలో నటించిన ప్రతీ ఆర్టిస్టూకూ సారీ చెప్పిన గోపీచంద్

Advertiesment
Gopichand, Srinuvaitla, TG Vishwaprasad, Kavya Thapar, venu

డీవీ

, మంగళవారం, 8 అక్టోబరు 2024 (11:50 IST)
Gopichand, Srinuvaitla, TG Vishwaprasad, Kavya Thapar, venu
గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.
 
వేడుకలో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. గోపి మోహన్ తో పాటు ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్ కి థాంక్యూ. గోపి మోహన్ గారు లక్ష్యం, లౌక్యం సినిమాలకి పని చేశారు. విశ్వం కూడా సేమ్ రేంజ్ ఆఫ్ హిట్ అవుతుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి సారీ చెప్పాలి.  ఎందుకంటే యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ చూస్తున్నప్పుడు నాకు నవ్వు వచ్చేసింది. సీన్స్ అంత బాగా వచ్చినాయి. ప్రతి సీన్ చేసేటప్పుడు సెట్ లో నవ్వుకుంటూనే ఉన్నాం.  డైరెక్టర్ శ్రీను గారితో ఎప్పటినుంచో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఫంక్షన్ లో కలిసాం. అప్పటినుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఆయన స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. తన సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారో అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఆయన స్క్రిప్ట్ మీద దాదాపు 7 నెలలు పని చేశారు. ఆయన సీన్ చెప్పినప్పుడే చాలా అద్భుతంగా పెర్ఫాం చేస్తారు. అక్టోబర్ 11న దసరాకి సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ నవ్వు ఆగదు. యాక్షన్, కామెడీ, ఫన్ ఎక్స్ ట్రార్డినరీగా వచ్చింది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక మాట చెప్పగలను. శ్రీనువైట్ల గారు ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్  అన్నారు 
 
డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ఈ సినిమాని నేను అనుకున్నది అనుకున్నట్లు తీయగలిగాను. ఐ యాం 100% కాన్ఫిడెంట్ ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. రెండున్నర గంటలో ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. ఎంగేజింగ్ గా హిలేరియస్ గా వుంటుంది. చేతన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాకి రీ రికార్డింగ్ చేయడం చాలా కష్టం. తను ఎఫర్ట్ లెస్ గా చాలా బాగా చేశాడు.  డెఫినెట్ గా ఈ సినిమా నాకు గోపికి చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ హిట్ తో దసరాని చాలా ఎంజాయ్ చేయబోతున్నాం. అందరికీ హ్యాపీ దసరా. థాంక్యూ సో మచ్' అన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బింగ్ సినిమాలపై అబ్బూరి రవి విమర్శలకు సొల్యూషన్ దొరుకుతుందా?