Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవిష్ణు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, గెటప్స్ మెస్మరైజ్ చేస్తాయి: ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్

Producer TG Vishwaprasad

డీవీ

, గురువారం, 3 అక్టోబరు 2024 (17:19 IST)
Producer TG Vishwaprasad
శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ 'శ్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. 
 
'శ్వాగ్' ఎలాంటి కథ ? 
-శ్రీవిష్ణు గారు అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్స్ అలాగే కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. 'శ్వాగ్' లో ఎంటర్ టైన్మెంట్ తో పాటు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ హైలెట్ గా వుంటాయి. మొత్తం నాలుగు క్యారెక్టర్స్ చేస్తున్నారు. దాదాపు తొమ్మిది గెటప్స్ లో ఆయన్ని ఆడియన్స్ చూడబోతున్నారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎక్స్ ట్రార్డినరీ ఎమోషనల్ మెసేజ్ వుంటుంది. 
 
డైరెక్టర్  హసిత్ గోలి గురించి ? 
-హసిత్ గోలికి ఎక్స్ ట్రార్డినరీ రైటింగ్ స్కిల్ వుంది. ఆయన ఎంటర్ టైన్మెంట్ ని చాలా ఈజీగా రాస్తారు. శ్వాగ్ లో ఎమోషనల్ మెసేజ్ వున్న కంటెంట్ చేశారు. ఇలాంటి కథలు చాలా రేర్ గా వస్తాయి. ఇందులో సాలిడ్ మెసేజ్ వుంటుంది. జనరేషన్స్ లో మారుతూ వస్తున్న జెండర్ డామినెన్స్ ఇందులో చాలా ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు హసిత్.
 
ఇది నాలుగు తరాల కథ కదా.. ఎలాంటి స్క్రీన్ ప్లే వుంటుంది?
-డైరెక్టర్ ఈ కథని అందరికీ అర్ధమయ్యే స్క్రీన్ ప్లే తో డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగా వుంటుంది. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లెస్ చేసే విధానం చాలా ఎంటర్టైనింగ్ గా వుంటుంది. ఇంటర్వెల్ వరకూ థ్రిల్ అండ్ సర్ ప్రైజ్ ఫ్యాక్టర్ కంటిన్యూ అవుతుంది. మెయిన్ స్టొరీ రివిల్ అయిన తర్వాత ఇంటర్వెల్ నుంచి చాలా మంచి ఎమోషన్ వుంటుంది.
 
-మేము కమర్శియల్ తో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాలూ చేస్తున్నాము. మా గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ 2 ఎలాంటి సక్సెస్ ఇచ్చాయో స్వాగ్ కూడా అలా గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం వుంది. కమల్ హాసన్ గారి ఇంద్రుడు చంద్రుడు, మైఖేల్ మదన్ కామరాజు ఈలాంటి క్యారెక్టరైజేషన్ లోని మ్యాజిక్ శ్వాగ్ లో వుంటుంది.  శ్రీవిష్ణు అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ చేస్తారు. హసిత్ చాలా అద్భుతంగా సినిమాని మలిచాడు. 
 
శ్వాగ్ సినిమా విషయంలో మీకు ఛాలెంజ్ గా అనిపించిన అంశం ఏమిటి? 
-ప్రొడక్షన్ సైడ్ ఎలాంటి ఛాలెంజ్ లేదండి. క్రియేటివ్ సైడ్ మాత్రం ఛాలెంజే. ఈ సబ్జెక్ట్ ని 2గంటల36నిమిషాల్లో చెప్పడం అనేది టఫ్ జాబ్. అన్ని క్యారెక్టర్స్ ని డైరెక్టర్ చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసి ఎంగేజింగ్ గా చెప్పారు.  
 
మీరా జాస్మిన్ గారి క్యారెక్టర్ ఎలా వుండబోతోంది ? 
-ఇందులో రెండు భవభూతి పాత్రలు వుంటాయి. కరెంట్ జనరేషన్ క్యారెక్టర్ కి ఆమె వైఫ్ గా కనిపిస్తారు, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆమె క్యారెక్టర్ లో చాలా మంచి ఎమోషన్ వుంటుంది. 
 
ఈ సినిమాకి చాలా సెట్స్ వేశారు కదా? ఆ ఎక్స్ పీరియన్స్ గురించి ?  
-శ్వాగ్ లాంటి స్పాన్ వున్న కథని ఈ కాస్ట్ లో చేయడం అంత ఈజీ కాదు. ఈ కాస్ట్ నార్మల్ మార్కెట్ ఎవైలబుల్ కాస్ట్ కి టు టైమ్స్. క్యాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండ చేశాం.  
 
కన్నడలో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాం? 
-ప్రస్తుతం డిస్ట్రిబ్యుషన్ చేస్తున్నాం. 2025లో దాదాపు నాలుగు సినిమాలు లాంచ్ చేస్తాం. ప్రీ వర్క్ జరుగుతోంది. నెక్స్ట్ మంత్ అనౌన్స్ మెంట్స్ వుంటాయి. 
 
వెబ్ ప్రాజెక్ట్స్ గురించి ? 
'హరికథ' అనే ప్రాజెక్ట్ చేస్తున్నాం. అది హాట్ స్టార్ లో రాబోతోంది. అలాగే న్యూసెన్స్ 2 చేస్తున్నాం. మరిన్ని వెబ్ సిరిస్ లు చేయాలనే ప్లానింగ్స్ వున్నాయి.
 
రాజాసాబ్ షూటింగ్ ఎక్కడి వరకూ వచ్చింది ? 
-నవంబర్ లో షూటింగ్ ఫినిష్ చేయాలని భావిస్తున్నాం. 
 
మీ ప్రొడక్షన్ లో 50 మైల్ స్టోన్ మూవీ గురించి స్పెషల్ గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? 
-ప్రొడక్షన్ నెంబర్ 50 నాకు తెలుసు. రిలీజ్ 50 ఏమిటనేది నాకు తెలీదు. 50వ సినిమా కోసం పర్టిక్యులర్ గా ప్లానింగ్ ఏమీ లేదు.
 
ఆడియన్స్ 'శ్వాగ్' నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ ఆశించవచ్చు ?
-ఫస్ట్ హాఫ్ ఎంటర్ టైనింగ్ విత్ లాట్ అఫ్ సస్పెన్స్, క్యురియాసిటీ. సెకండ్ హాఫ్ డిఫరెంట్ ఎమోషన్. సినిమా చూసిన బయటికి వచ్చినప్పుడు ఆడియన్స్ వెరీ న్యూ ఎక్స్ పీరియన్స్ ని ఫీల్ అవుతారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో చిరు కుటుంబానికి వైకాపా.. తెలంగాణలో నాగ్ ఫ్యామిలీని బజారుకీడ్చిన కాంగ్రెస్?