Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కేసిందే- అంటూ పాడుకుంటున్న‌మెహ్రీన్, సంతోష్ శోభన్

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (16:49 IST)
Mehreen, Shobhan
మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, సంతోష్ శోభన్ `ఎక్కేసిందే` అంటూ త‌న్మ‌యంతో పాట పాడుకుంటున్నారు. ఈ పాట‌ను మంగ‌ళ‌వారంనాడు ప్రోమోసాంగ్‌గా విడుద‌ల చేశారు. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా `మంచి రోజులు వచ్చాయి` లోనిది ఈ పాట‌.
 
యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏక్ మినీ కథ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంతోష్ శోభన్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. 
 
సంతోష్ శోభన్, మెహరీన్ డాన్స్ ప్రోమోలో హైలైట్ అయింది. సెప్టెంబర్ 23న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఈ ప్రోమో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

సింగయ్య మృతికి జగన్ ప్రయాణించిన వాహనమే కారణం... తేల్చిన ఫోరెన్సిక్

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments