Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చూపులు మ్యూజిక్ విని ఇన్ స్పైర్ అయ్యాః సంగీత దర్శకుడు పవన్ సీహెచ్

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (16:36 IST)
Pawan CH
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ "లవ్ స్టోరి" కావడం విశేషం. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 24న "లవ్ స్టోరి" థియేటర్ రిలీజ్ కు సిద్ధమవుతున్న సందర్భంగా సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ సినిమాకు పనిచేసిన అనుభవాలు, తన కెరీర్ విశేషాలు తెలిపారు. 
 
పవన్ సీహెచ్ మాట్లాడుతూ, మాది సినిమా ఫ్యామిలీ. మా నాన్నగారు విజయ్, తాతగారు సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేశారు. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్. అలా చదువులు పూర్తయ్యాక మ్యూజిక్ అకాడెమీలో సంగీతం నేర్చుకున్నాను. కీబోర్డ్, ఇతర సంగీత పరికరాల గురించి నైపుణ్యం నేర్చుకున్నాను. ఒక సంగీత విభావరిలో రెహమాన్ గారు నా పాటలు విని, వచ్చి కలవమని అన్నారు. నా సంగీతం, కంపోజిషన్ ఆయనకు బాగా నచ్చాయని చెప్పి సహాయకుడిగా పెట్టుకున్నారు. అలా రెహమాన్ గారితో శివాజీ, రోబో, సర్కార్ తదితర చిత్రాలకు పనిచేశాను. ఫిదా సినిమా టైమ్ నుంచి దర్శకుడు శేఖర్ కమ్ముల గారి దగ్గర పనిచేసేందుకు ప్రయత్నిస్తూ వచ్చాను. ఫిదాకు నేను పంపిన పాటలు ఆయనకు నచ్చినా, ఆ సినిమా చాలా ఇంపార్టెంట్ అని, కొత్తవాళ్లతో రిస్క్ చేయలేనని చెప్పి వద్దన్నారు. కానీ ఆయనతో టచ్ లో ఉన్నాను. 
 
లవ్ స్టోరి సినిమాకు శేఖర్ కమ్ముల గారు పిలిచి అవకాశం ఇచ్చారు. ముందు కొన్ని సందర్భాలు చెప్పి ట్యూన్స్ చేయమన్నారు. ఆ తర్వాత నువ్వు సినిమాకు పనిచేస్తున్నావ్ అని చెప్పి సర్ ప్రైజ్ చేశారు. అప్పటిదాకా చేసిన పాటలన్నీ బ్యాంక్ లా పనికొచ్చాయి. లవ్ స్టోరి సినిమా ఒక ఎమోషనల్, ఇంటెన్స్, డెప్త్ ఉన్న సినిమా. ఈ చిత్రానికి శేఖర్ గారు మాకు చెప్పిన విషయం ఒకటే పాటలు సందర్భాన్ని ప్రతిబింబించాలి. అంతకంటే ఇంకేం వద్దు అన్నారు. నేను ప్రతి పాటను పూర్తి శాటిశ్వై అయ్యే దాకా రీచెక్ చేసుకుని శేఖర్ కమ్ముల గారికి పంపేవాడిని. ఆయన పాటల కంపోజిషన్ లో ఇచ్చిన  గైడెన్స్ అద్భుతం. ప్రతి పాట సందర్భం, దాని నేపథ్యం, పాట పాటర్న్ ఎలా ఉండాలి..ఇలా ప్రతి విషయం మీద శేఖర్ గారికి చాలా స్పష్టత ఉంది. ఆయనకు ఫోక్ సాంగ్స్ మీద విపరీతమైన ఇష్టం.
 
సారంగ దరియా పాటను మళ్లీ బాగా చేయాలని చెప్పి చేయించారు. లవ్ స్టోరి పాటలు ఇన్ని మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం కొత్త సంగీత దర్శకుడిగా చాలా సంతృప్తిగా ఉంది. ఈ పాటలు రెహమాన్ గారికి పంపాలంటే భయమేసింది. కానీ నా మిత్రులు కొందరు ఆయనకు నా పాటలు బాగున్నాయని చెప్పారట. థమన్ సంగీతం చాలా ఇష్టపడతాను. ఆయన పుష్ప సినిమాలో చేసిన పాట నాకు బాగా నచ్చింది. అలాగే వివేక్ సాగర్ మ్యూజిక్ బాగుంటుంది.పెళ్లి చూపులు మ్యూజిక్ విని ఇన్ స్పైర్ అయ్యాను. లాక్ డౌన్ లో మా లవ్ స్టోరి సినిమా విడుదల వాయిదా పడటం కొంత ఫ్రస్టేషన్ కలిగించింది. ఒక మూడ్ లో అందరం పనిచేసుకుంటూ వచ్చాం. కానీ మా పనికి లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడింది. మంచి చిత్రాలు చేసి, సంగీత దర్శకుడిగా నాకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకోవాలనేది నా లక్ష్యం. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ.. ఎక్కడినుంచైనా గెలుస్తా! (video)

stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments