Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి సర్జా సతీమణికి రెండో పెళ్లి.. రాయన్ రాజ్ సర్జ అనే పేరు..?

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (09:55 IST)
కన్నడ హీరో చిరంజీవి సర్జా 2020 జూన్ 7న గుండెపోటుతో కన్నుమూశాడు. చిరు మరణం తర్వాత ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లిపోయింది. ఆయన మరణాన్ని జీర్ణించుకోడానికి.. చిరంజీవి లేడని అర్థం చేసుకోడానికి చాలా సమయం తీసుకున్నారు అభిమానులు.  
 
ఇకపోతే.. చిరంజీవి సర్జా భార్య మేఘన రాజ్ విషయంలో ఎంతో కుంగిపోయారు. చిరంజీవి చనిపోయిన నాలుగు నెలల తర్వాత మేఘనకు అబ్బాయి పుట్టాడు. అతడిని మొన్నటి వరకు జూనియర్ చిరంజీవి సర్జ అని పిలిచేవారు. అయితే ఈ మధ్యే తమ వారసుడి పేరు అధికారికంగా ప్రకటించింది మేఘనా రాజ్. చిరు కొడుక్కి రాయన్ రాజ్ సర్జ అనే నామకరణం చేసారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరోవైపు చిరు మరణం తర్వాత పూర్తిగా ఇంట్లోనే ఉండిపోయింది మేఘన. ఇప్పుడు కొడుకుతో పాటు హాయిగా ఉంటుంది. పోయిన భర్తను కొడుకులో చూసుకుంటుంది ఈమె.  
 
అందుకే కీలక నిర్ణయం తీసుకుంది. చిరంజీవితో పెళ్లి తర్వాత సినిమాలకు పాక్షికంగా బ్రేక్ ఇచ్చింది మేఘన. అయితే ఇప్పుడు ఆయన చనిపోవడంతో కెరీర్‌పై మరోసారి ఫోకస్ చేసింది. వరుస సినిమాలు చేస్తే కానీ ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేనని ఫిక్స్ అయిపోయింది ఈమె.
 
ప్రస్తుతం మేఘన రాజ్ రెండు సినిమాలు చేస్తుంది. సెల్ఫీ మమ్మీ.. గూగుల్ డాడీ సినిమాతో పాటు బుద్ధిమంత 2లో నటిస్తుంది మేఘన. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.   
 
మేఘనకు కన్నడలో మంచి ఇమేజ్ ఉంది. అందుకే అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. కానీ మేఘన సర్జా రెండో పెళ్లిపై ప్రస్తుతం వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై సీరియస్ అయింది మేఘనా రాజ్.
 
మరోవైపు బిగ్ బాస్ 1 కన్నడ విన్నర్‌తో ఈమె ఏడడుగులు నడవబోతుందనే ప్రచారం ఈ మధ్య జరిగింది. ఇందులో ఎలాంటి నిజం లేదని.. లేనిపోని వార్తలు రాసి అనవసరంగా ప్రశాంతత చెడగొట్టొద్దని చెప్తున్నారు మేఘన రాజ్. తనకు అలాంటి ఉద్దేశాలు లేవని.. తన కొడుకు తనకు సర్వస్వం అంటోంది మేఘన.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments