Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడే దిశంగా మెగాస్టార్ ఫ్యాన్స్‌

Webdunia
సోమవారం, 5 జులై 2021 (17:01 IST)
megastar 50days poster
దేశంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడేదిశ‌గా ప్ర‌తిన పూనారు. ఆగ‌స్టు 22న చిరంజీవిగా పుట్టిన‌రోజు. అందుకు యాభైరోజుల ముందుగానే చిరంజీవి న‌టించిన కొన్ని సినిమా స్టిల్స్‌ను పోస్ట‌ర్‌గా డిజైన్ చేసి అభిమానులు బ‌య‌ట‌కు విడుద‌ల చేశారు. అది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. వృక్షో ర‌క్షితో ర‌క్షితః అనే నినాదాంతో వారంతా ముందుకు సాగుతున్నారు. మొక్క‌వోని దీక్ష‌తో మొక్క‌ల‌ను నాటి ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడాల‌ని దిశ‌గా ప‌య‌నిస్తున్నారు.
 
ఇటీవ‌లే మ‌న అంద‌రం చూస్తూనే వున్నాం. క‌రోనా టైంలో పీల్చే ఆక్సిజ‌న్ అంద‌క చాలామంది అసువులు బాశారు. వారికి అండ‌గా మెగాస్టార్ చిరంజీవి త‌ల‌పెట్టిన ఆక్సిజ‌న్ ప్లాంట్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఆక్సిజ‌న్ ఇన్క్యుటేర్ల‌ను అంద‌జేశారు. ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. కోవిడ్ టీకాలను వృద్ధుల‌కు, వేక్సిన్ అవ‌స‌ర‌మైన వారికి అభిమానులు వేయించారు. మెగాస్టార్ కూడా హైద‌రాబాద్‌లో త‌న బ్ల‌డ్ బేంక్‌లో సినీమారంగంలోని 24 శాఖ‌ల‌కు చెందిన కార్మికుల‌కు కోవిడ్ టీకాలు వేయించారు.

అందుకే మెగాస్టార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప‌లు నిర్ణ‌యాల‌ను తీసుకున్నామ‌ని అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు ర‌వ‌ణం స్వామినాయుడు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆగ‌స్టు 1నుంచి 22 వ‌ర‌కు మొక్క‌లు నాటాల‌ని అభిమానుల‌కు పిలుపు ఇచ్చారు. ఈలోగా ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు అభిమానులు పాల్గొంటార‌ని జైచిరంజీవి, జైజై చిరంజీవ అంటూ నినాదాల‌తో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments