Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవితో శంకర్ సినిమా.. ఇదే కాలానికి పూర్తవుతుందో?

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:52 IST)
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కేరళలో జరుగుతున్న 'సైరా' సినిమా షూటింగ్ బిజీ బిజీగా ఉన్నాడు. కేరళలో పది రోజులపాటు షూటింగ్ జరగనుంది. అక్కడ పూర్తయ్యాక తదుపరి హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. 'సైరా' తరువాత మెగాస్టార్ తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తారు. ఆపై త్రివిక్రమ్ సినిమా ఉంటుందని తెలిసింది. 
 
ఈ రెండు సినిమాల తరువాత మెగాస్టార్ చిరంజీవి మరో భారీ చిత్రాల దర్శకుడుగా పేరు పొందిన శంకర్‌తో సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మిస్తారని వినికిడి. 
 
ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ సినిమాలో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తే, తమిళంలో అజిత్ లేదా విజయ్ నటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కాలంటే మరో సంవత్సరమైనా పడుతుందని అంచనా. ఇది మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పారిశుద్ధ్యం కార్మికుల వేషంలో యూట్యూబర్ ఇల్లు ధ్వంసం... ఇంట్లో మలం వేశారు..

Rajini: ఎంపీ లావు కృష్ణ దేవ రాయలకు పూర్తి వడ్డీతో తిరిగి చెల్లిస్తాను.. రజనీ స్ట్రాంగ్ వార్నింగ్

వైకాపా హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్‌పై హోం మంత్రి అమిత్ షా ఆరా!!

Mogalthuru : మొగల్తూరుపై కన్నేసిన పవన్ కల్యాణ్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

కొడాలి నానికి ఛాతిలో నొప్పి.. హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తరలింపు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments