జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

దేవీ
శనివారం, 12 ఏప్రియల్ 2025 (12:43 IST)
Jai sriram song - chiru
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’ లో రామరామ.. పాటను హనుమత్ జయంతి సందర్భంగా నేడు విడుదల చేశారు. రామ రామ..రామ.. అంటూ శంకర్ మహదేవన్, లిప్సిక పాడిన ఈ పాటలో చిరంజీవి బ్రుందం తన శైలిలో పండించారు. ‘జై శ్రీరామ్’ అనే చిరు వాయిస్‌తో పాట ప్రారంభమవుతుంది. ‘రామ.. రామ..’ అంటూ సాగే ఈ పాటను కీరవాణి స్వరపరచగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 
 
 హైదరాబాద్ శివార్లో వేసిన ఆలయం సెట్లో చిత్రీకరించారు. ‘తయ్యతక్క తక్కధిమి చెక్కభజనాలాడి..రాములోరి గొప్ప చెప్పుకుందామా.. నీ గొంతు కలిపి మా వంత పాడగ.. రావయ్య అంజని హనుమా..’ అంటూ సాగే ఈ పాట భక్తిభావాన్ని పెంపొందించేదిగా ఉంది. ఇక ఈ పాటకు చిరు స్టెప్స్‌తో మరింత వన్నె తెచ్చారు. మొత్తానికి హనుమాన్ జయంతికి గూస్‌బంప్స్ వచ్చేలా పాటను రూపొందించి మేకర్స్ వదిలారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను జూలై 24న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

Bhuvaneswari: నారా లోకేష్‌ను అభినందించిన భువనేశ్వరి.. ప్రభుత్వ విద్య అదుర్స్

రెండు రోజుల్లో పెళ్లి.. ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

స్కూలుకు లేటు.. వీపు మీద బ్యాగ్‌తోనే 100 గుంజీలు.. బాలిక మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments