Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌ల‌సాని గారి కృషి అభినంద‌నీయం : మెగాస్టార్ చిరంజీవి

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (21:23 IST)
సినీ-టీవీ కార్మికులకు సాయం అందించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్, తలసాని సాయికిరణ్ యాదవ్ ముందుకు వచ్చారు. 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా నిత్యావ‌స‌రాల సాయం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారిలో 12 వేల మంది సినీ, 2వేల మంది టీవి కార్శికులకు మొత్తం 14 వేల మందికి నిత్యావసరాల పంపిణీ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో సరుకుల పంపిణీ  చేసారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్కినేని నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, కొరటాల శివ, రాధాకృష్ణ, రామ్ మోహనరావు, తలసాని సాయి, ఎన్.శంకర్, సి.కళ్యాణ్, అభిషేక్, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 
 
సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, కొరటాల శివ, రాధాకృష్ణ, రామ్ మోహనరావు, తలసాని సాయి, ఎన్.శంకర్ , సి.కళ్యాణ్  చేతుల‌మీదుగా కార్శిక యూనియన్ నాయకుల ద్వారా నిత్యావసర వస్తువులను అందించారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనాల్సి ఉండ‌గా కార‌ణాంత‌రాన ఆయ‌న రాలేక‌పోయారు. ఈ సంద‌ర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంపారు. 
 
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-``మా మిత్రులు, శ్రేయోభిలాషులు మ‌న సిసిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ గారు త‌ల‌సాని సేవా ట్ర‌స్ట్ ద్వారా 14 వేల మంది సినీ-టీవీ కార్మికుల్ని ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చినందుకు సంతోషం. కేవ‌లం సినీరంగంలోని వారే కాకుండా టీవీ రంగంలోని వారికి సాయం చేస్తుండ‌డం మంచి విష‌యం. సినీప‌రిశ్ర‌మ త‌ర‌పున ధ‌న్య‌వాదాలు.
 
నిజానికి ఈరోజు కార్య‌క్ర‌మానికి నేను కూడా హాజ‌రు కావాల్సి ఉంది. కానీ స‌మీప బంధువులు చ‌నిపోవ‌డం వ‌ల్ల రాలేక‌పోయాను. ప‌రిశ్ర‌మ‌కు క‌ష్ట కాలంలో త‌ల‌సాని గారి కృషి అభినంద‌నీయం. గ‌త నెల‌లో సీసీసీ ద్వారా నిత్యావ‌స‌రాల సాయం అందించిన విషయం తెలిసిందే. ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌భుత్వానికి సంధానక‌ర్త‌లుగా కావాల్సిన సాయం అందిస్తున్న ఆయ‌న ఇప్పుడిలా సేవా కార్య‌క్ర‌మం చేయ‌డం సంతోషాన్ని క‌లిగిస్తోంది. క‌ష్ట‌కాలంలోనూ అన్నివిధాలా చేదోడువాదోడుగా ఉంటున్నందుకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు`` అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments