Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుఎస్‌లో "రంగస్థలం" జోరు : సక్సెస్‌మీట్‌లో కలవనున్న మెగాబ్రదర్స్

రామ్ చరణ్ - సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "రంగస్థలం". గత నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ దర్శకుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఈ సినిమా వసూళ్ల పరంగా

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (19:02 IST)
రామ్ చరణ్ - సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "రంగస్థలం". గత నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ దర్శకుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఇంతవరకూ ఈ సినిమా అక్కడ రూ.20.77 కోట్లను రాబట్టినట్టు సమాచారం. ఈ సినిమా ఇంత వేగంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం నిజంగా విశేషమని అంటున్నారు.
 
గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ.. తెలుగుదనం నిండిన పాత్రలు.. పాటలను సైతం పల్లెచుట్టూ తిప్పిన తీరు ఈ సినిమాకి అక్కడ ఇంతటి ఆదరణ లభించేలా చేశాయని అంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా రూ.150 కోట్లకి‌పైగా గ్రాస్‌ను రాబట్టి, అదే జోరుతో ముందుకు వెళుతోంది. ఇది చరణ్ కెరియర్‌లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచినందుకు మెగా అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు.  
 
మరోవైపు, డెరెక్టర్ సుకుమార్ ఫారిన్ నేపథ్యంలో 'నాన్నకు ప్రేమతో'  సినిమాను తెరకెక్కించి హీరో ఎన్టీఆర్‌కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇపుడు గ్రామీణ నేపథ్యంలో "రంగస్థలం" సినిమా చేసి చరణ్‌కి కూడా అనూహ్యమైన విజయాన్ని అప్పగించాడు. ఇటీవల విడుదలైన 'రంగస్థలం' సినిమాకి అన్ని ప్రాంతాల ప్రేక్షకులు పట్టంకట్టారు. కథాకథనాల పరంగాను... పాత్రలను తీర్చిదిద్దిన విధానంలోను ఈ సినిమా అదుర్స్ అంటున్నారు. 
 
అలాంటి ప్రేక్షకులతో కలిసి విజయోత్సాహాన్ని జరుపుకునేందుకు భారీస్థాయిలో సక్సెస్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అయితే ఈ వేడుకను ఎక్కడ.. ఎప్పుడు జరుపనున్నారనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ - యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకను జరుపనున్నారనేది తాజా సమాచారం. ఈ వేడుకకి చిరంజీవి.. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానుండటం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments