Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మెగాస్టార్

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (16:11 IST)
meghastar,republic
గణతంత్ర దినోత్సవ వేడుకులు ఈ రోజు దేశమంతటా పండగల జరుపుకుంటున్నారు. నేడు 72 వ గణతంత్ర దినోత్సవం. ఈ వేడుకలు అన్ని రంగాల్లో.. రాజకీయ నాయకుల నుండి సామాన్య ప్రజలంతా జరుపుకునే పండగ. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ జరుపుకునే ఈ వేడుకలు ఎప్పటి లాగే ఈ రోజు చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో ఘనంగా జరిగాయి.

ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నాగబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు టీం తో పాటు మెగా ఫాన్స్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగా అభిమానులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి రక్తదానం చేసిన అభిమానులను చిరంజీవి, రామ్ చరణ్ లు పరామర్శించారు. మెగా అభిమానుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
 
ఆయ‌న మాట్లాడుతూ...  రిప‌బ్లిక్ డే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని విస్తృతంగా రక్త‌దానం చేయ‌సంక‌ల్పించిన మెగా బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్‌ని మ‌న‌స్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేర‌కు స్పందించి, చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌కు వ‌చ్చి, ర‌క్త‌దానం చేసిన‌, చేస్తున్న రక్త‌దాక్త‌ల‌కు హృద‌య పూర్వక ధ‌న్య‌వాదాలు. ర‌క్త దానం చేయండి, ప్రాణ దాత‌లు కండి అంటూ చిరంజీవి త‌న వాయిస్ వీడియో ద్వారా సందేశాన్ని అందించారు.
chiru,balu photo
మర‌ణానంతరం అనే ప‌దం బాధ‌ను క‌లిగిస్తుంది
 ఇప్ప‌టికే ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం అందుకున్న గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యంకి   ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డ్ ద‌క్క‌డం ప‌ట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్య‌క్తం చేశారు. నా ప్రియ‌మైన సోద‌రుడు ఎస్పీ బాలు గారుకు ప‌ద్మ విభూష‌ణ్‌కు ప్ర‌క‌టించినందుకు సంతోషంగా ఉంది. అత‌ను దీనికి అర్హుడు. మర‌ణానంతరం అనే ప‌దం బ్రాకెట్స్‌లో ఉండ‌డం బాధ‌ను క‌లిగిస్తుంది. ఈ అవార్డును ఆయ‌న‌ వ్య‌క్తిగ‌తంగా స్వీక‌రించి ఉంటార‌ని భావిస్తున్నాను అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు మెగాస్టార్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Midhun Reddy: మిధున్ రెడ్డిని పట్టించుకోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి?

Nara Lokesh: కర్ణాటకపై నారా లోకేష్ దూకుడు విధానం.. ఈ పోటీ రాష్ట్రాలకు మేలు చేస్తుందిగా?

పూజ చేస్తూ కుప్పకూలిపోయిన పూజారి.. అంబులెన్స్ దొరకలేదు.. వైద్యులు లేరు..?

Janasena: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిర్మాత రామ్ తాళ్లూరి

Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments