Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30 ఏళ్ళ‌కు క‌లిసిన చిరంజీవి గ్యాంగ్‌

Advertiesment
30 ఏళ్ళ‌కు క‌లిసిన చిరంజీవి గ్యాంగ్‌
, ఆదివారం, 24 జనవరి 2021 (20:51 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ఆయన కెరీర్‌లోని బెస్ట్ సినిమాల్లో ఒకటి. మెగాస్టార్ కెరీర్‌లో ఈ సినిమా చేసిన అద్భుతాలు అన్ని ఇన్ని కావు. విజయ బాపినీడు తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్‌గా నటించారు. మురళి మోహన్, శరత్ కుమార్‌లు కూడా ప్రముఖ పాత్రలు పోషించారు. మెగాస్టార్ చిరంజీవి సోదరులుగా నటించిన ఈ ఇద్దరు అనుకోకుండా ఆయనను కలిశారు.

ఆచార్య సినిమా షూటింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నారు. అయితే అక్కడే ఈ ముగ్గురు అనుకోకుండా కలిశారు. శరత్ కుమార్ మణిరత్నం సినిమాలో నటిస్తుండగా, మురళి మోహన్ తమిళ్ సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగులు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండటంతో యాదృచ్చికంగా కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరో రెండు నెలల్లో గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తి కానుండడం విశేషం. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సందర్భంగా మురళీ మోహన్ తన సంతోషాన్ని వీడియో ద్వారా తెలియ‌జేశారు.
 
ఆచార్య సెట్‌లో మెగాస్టార్ చిరంజీవిగారిని, శరత్ కుమార్ గారిని కలవడం చాలా సంతోషంగా అనిపించిదని మురళీ మోహన్ చెప్పారు. ‘‘మేం ముగ్గురం కలవగానే మాకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. 1991లో మేం ముగ్గురం ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో అన్నదమ్ముల్లాగా నటించాం. మళ్లీ 30 సంవత్సరాల తర్వాత అదే ముగ్గురం మళ్లీ కలిసేటప్పటికీ అది గుర్తుకు వచ్చి.. చిరంజీవిగారు మనం ఒక ఫొటో తీసుకుందాం. ఆ ఫొటోను ఫ్యాన్స్‌కు పంపిద్దాం.. అందరూ సంతోషపడతారు అని చెప్పా. అలా మేం ముగ్గురం మళ్లీ ఇలా ఫొటోలు తీసుకున్నాం. ముగ్గురూ ఇలా మళ్లీ కలవడం చాలా సంతోషంగా ఉంది’’ అని మురళీ మోహన్  తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టుడే స్పెష‌ల్ అంటున్న జాక్వెలిన్ ఫెర్నాండైజ్