ఆ టైటిల్‌ను టచ్ చేస్తావా.. నానిపై చిరు ఫ్యాన్స్ ఫైర్..

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (15:43 IST)
మెగాస్టార్ చిరంజీవి అంటే నచ్చని వారుండరు. చిరంజీవి గారు ఏ సినిమాలో నటించినా అందులో ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. సినిమాల్లోని పాటలు అంతకు మించినవిగా ఉంటాయి. మెగాస్టార్‌కు ఉన్న అభిమానులు మరెవ్వరికి ఉండరంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి గారి పోస్టర్‌పైన ఈగ వాలినా కూడా తట్టులేనివాళ్లు ఆయన టైటిల్‌ను డబ్ చేస్తే ఊరుకునేది లేదంటున్నారు.
 
ప్రస్తుతం నాని నటిస్తోన్న గ్యాంగ్ లీడర్ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. నాని పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నాడు ఈ సినిమా టైటిల్‌ను రిలీజ్ చేశారు. దాంతో చిరంజీవి ఫ్యాన్స్‌కు పిచ్చ పిచ్చగా కోపం వచ్చింది. చిరంజీవిగారి టైటిల్‌ను నువ్వెలా వాడుతావ్ అంటూ నానిపై ఫైర్ అవుతున్నారు చిరు ఫ్యాన్స్. చిరంజీవిగారి మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్ ఆయన పాటలను ముట్టుకుంటేనే ఊరుకోలేదు.. ఈ టైటిల్ మెగాస్టార్ మాత్రమే వాడుకునేది ఇంకెవ్వరూ వాడటానికి వీళ్లేదని ట్విట్టర్‌లో ట్రోలింగ్ మెుదలెట్టారు చిరు అభిమానులు. 
 
నీకు ఎంత ధైర్యముంటే చిరంజీవిగారి టైటిల్‌ను టట్ చేస్తావంటూ నానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు కోపంతో చెప్తున్నారు.. మరికొందరు నాని సార్ దయచేసి టైటిల్ మార్చుకోండి అంటూ వినయంగా అడుగుతున్నారు. ఏదేమైనా గ్యాంగ్ లీడర్ టైటిల్‌ను నాని వాడుకోవడం చిరు ఫ్యాన్స్‌కు అస్సలు ఇష్టం లేదు. 

నిజం చెప్పాలంటే.. ఈ టైటిల్‌తో రామ్ చరణ్ సినిమా తీస్తే బాగుంటుందని మెగాస్టార్ అభిమానులు ఆశించారు. ఇటీవలే విడుదలైన వినయ విధేయ రామ చిత్రానికి ఈ గ్యాంగ్ లీడర్ టైటిల్‌నే పెట్టాలనుకున్నారు. కానీ.. చరణ్ ఒప్పుకోకపోవడంతో ఆ ఆలోచన మానేశారు. అయితే.. ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్‌కు లీడర్‌గా నాని నటిస్తోన్న చిత్రానికి ఈ పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టడం వలన మెగా ఫ్యాన్స్ తీవ్ర అసహానానికి గురవుతున్నారు. ఇక ఈ టైటిల్‌ను నాని మార్చుతారో లేదో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గ్యాంగ్ రేప్ చేసి బయటే తిరుగుతున్నాడు.. యువతి ఆవేదన (వీడియో)

రేడియాలజిస్ట్ రాక్షసత్వం - మహిళ ప్రైవేట్ పార్టులను తాకుతూ... (వీడియో)

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : దూసుకుపోతున్న ఎన్డీయే.. కాంగ్రెస్ - పీకే అడ్రస్ గల్లంతు

అనకాపల్లిలో ఆరునెలల బిడ్డతో మహిళ అనుమానాస్పద మృతి.. వరకట్నం వేధింపులే..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారీ ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments