Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది నిజమైన దీపావళి.. చిరు :: నా పూర్వజన్మ సుకృతం.. సాయిధరమ్

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (09:12 IST)
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. దీంతో మెగా ఇంట జరిగిన దీపావళి వేడుకల్లో సాయిధరమ్‌తో పాటు మెగా ఫ్యామిలీ హీరోలంతా పాల్గొన్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్‌‍ కూడా పాల్గొనడం గమనార్హం. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు.
 
'మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ' అని ట్వీటర్‌ వేదికగా చిరంజీవి ఒక ఫోటోను పోస్ట్‌ చేశారు. అందులో మెగాస్టార్‌ చిరంజీవీ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. 
 
'అందరి ఆశీ స్సులు, దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు' అని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. అందులో మెగాస్టార్‌ చిరంజీవీ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చేయి వేసి ఉండగా, పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్‌లు ఉన్నారు.
 
దీనిపై సాయి ధరమ్‌ తేజ్‌ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ "నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్థనలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం" అని సాయి ధరమ్‌ తేజ్ ట్వీట్‌ చేశారు. 
 
కాగా కొన్ని రోజుల ముందు హైటెక్‌ సిటీ దగ్గర జరిగిన బైక్‌ యాక్సిడెంట్‌కుగురైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గాయపడ్డాడు. ఆపరేషన్ తర్వాత అనంతరం పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తొలిసారి ఫ్యామిలీ ఫంక్షన్‌లో అందరూ మెగా హీరోలను కలుసుకున్నాడు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments