Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు ఫామ్‌హౌస్‌లో మెగా సంక్రాంతి .. నెట్టింట వైరల్ అవుతున్న గ్రూపు ఫోటో - ఆ ఒక్కరు మిస్సింగ్

వరుణ్
సోమవారం, 15 జనవరి 2024 (21:42 IST)
మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబాలు సంక్రాంతి సంబరాలను బెంగుళూరులోని ఫామ్‌ హౌస్‌లో జరుపుకున్నాయి. ఈ రెండు కుటుంబాలకు చెందిన సభ్యులంతా ఈ వేడుకల్లో పాల్గొని ఈ సంబరాలు జరుపుకున్నారు. ఈ సభ్యులంతా కలిసి దిగిన గ్రూపు ఫోటోను తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా, అది నెట్టింట వైరల్ అయింది. ఇందులో మెగాస్టార్, అల్లు అరవింద్ కుటుంబాలకు చెందిన హీరోలు, హీరోయిన్లు, ఇతర కుటుంబ సభ్యులంతా ఉన్నారు. 
 
ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి, ఇటీవల ఓ ఇంటివారైన వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి దంపతులు కూడా ఉన్నారు. మెగా అల్లు వారింటి పిల్లలు అయితే సరేసరి. ఈ సంక్రాంతి పండుగ అంతా ఈ రెండు కుటుంబాల్లోనే ఉందన్న సందేహం వచ్చేలా మెగా, అల్లు వారి కుటుంబాలు సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. 
 
వీరి గ్రూపు ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అదరినీ ఈ ఫోటోలో చూడొచ్చ. ఇందులో ఉన్న మగవాళ్లంతా వైట్ షేడ్ దుస్తుల్లో కనిపించగా, మహిళలు అందరూ ఎర్ర రంగు కాంబినేషన్‌‍లో దుస్తులు ధరించారు. అయితే, జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సంక్రాంతి సంబరాల్లో కనిపించలేదు. ఆయన, ఆయన సతీమణి మాత్రం గ్రూపు ఫోటోలో మిస్సయ్యారు. వారిద్దరూ కూడా ఈ ఫోటోలో ఉండివుండే మెగా అభిమానులకు చిరకాలం గుర్తుండి పోయే ఫోటోల్లో ఇది ఒకటిగా ఉండేది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments