Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్‌. జ‌గ‌న్ తో మాట్లాడే విష‌యంపై చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖుల భేటీ

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (15:51 IST)
chiranjeevi house-meeting
క‌రోనా క్రైసిస్ నేప‌థ్యంలో సినీప‌రిశ్ర‌మ స‌మస్య‌ల‌పైనా.. అలాగే ఆంధ్రప్ర‌దేశ్ లో టిక్కెట్టు రేట్ల స‌మ‌స్య‌ల‌పైనా చ‌ర్చించేందుకు ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిన సంగ‌తి తెలిసిందే. మంత్రి పేర్ని నాని నేరుగా చిరుకి ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఈ భేటీలో సీఎంకి విన్న‌వించాల్సిన అన్ని విష‌యాల‌పైనా కూలంకుశంగా చ‌ర్చించి వెళ్లాల‌న్న ఉద్దేశంతో ఇండ‌స్ట్రీ మీటింగ్ హైద‌రాబాద్ మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జ‌రిగింది.  
 
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  ఫిలిం చాంబ‌ర్ అధ్య‌క్షులు నారాయ‌ణ దాస్, కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్. నారాయణమూర్తి, దిల్ రాజు, కే.ఎస్ . రామారావు , దామోదర్ ప్రసాద్,  ఏషియన్ సునీల్,  స్రవంతి  రవికిశోర్ , సి. కళ్యాణ్, ఎన్వి. ప్రసాద్, కొరటాల శివ,  వి.వి.వినాయక్, జెమిని కిరణ్,  సుప్రియ  భోగవల్లి బాపినీడు, యూవీ క్రియేషన్స్ విక్కీ - వంశీ ఇలా..నిర్మాత‌ల సంఘం.. పంపిణీ, ఎగ్జిబిష‌న్ రంగాల నుంచి ప్ర‌తినిధులు ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు. ఇటీవ‌ల ఏపీలో వ‌చ్చిన జీవోలో ఉన్న‌వాటిపై చ‌ర్చించారు. సీఎంతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాలేమిటి? అన్న‌దానిపై చ‌ర్చించారు. అన్నిటికీ త్వరగా ప‌రిష్క‌రించాల‌న్న‌ది ప్ర‌ధాన డిమాండ్. చిన్న నిర్మాత‌ల స‌మ‌స్య‌ల‌పైనా సీఎంతో భేటీలో చ‌ర్చించ‌నున్నారు.
 
ముఖ్యంగా ఈ భేటీలో టిక్కెట్టు రేట్ల‌పై చ‌ర్చించ‌నున్నారు. గ్రామ పంచాయితీ, న‌గ‌ర పంచాయితీ, కార్పొరేష‌న్ ఏరియాల్లో టిక్కెట్టు ధ‌ర‌ల‌పై ఏం అడ‌గాలి?  చిన్న సినిమాల మనుగడకోసం ఐదో షో విషయమై చర్చించుకోవడం జరిగింది. ఇండస్ట్రీలో నెలకొన్న అసంతృప్తిలపై సానుకూల వాతావరణం వచ్చేలా అవన్నీ ఓ కొలిక్కి వచ్చేలా అందరూ కలిసి చర్చించుకోవడం జరిగింది. అలాగే పరిశ్రమలో అన్ని భాగాల్లో ఎదుర్కొంటున్న అన్ని సమస్యల గురించి కూలంకుషంగా చర్చించడం ఈ సమస్యలు పరిష్కారం కోసం చర్చించుకోవడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments