కుటుంబ కలహాలు నేరాలకు దారితీస్తున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఓ అన్నను తమ్ముడే హత్య చేశాడు. అందుకు కారణం.. అన్న పెట్టుకున్న వివాహేతరం సంబంధం. వివరాల్లోకి వెళితే... ఏపీ లోని కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం శంకరాపురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, నాగార్జున ఇద్దరూ అన్నదమ్ములు. ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవారు.
అయితే అన్న అయిన వెంకట సుబ్బయ్యకు భార్య ఉంది. అయినా కానీ అతను కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దాంతో వారి గురించి ఊరంతా నీచంగా మాట్లాడుకునేవారు.
విషయం తెలుసుకున్న అతని తమ్ముడు నాగార్జున తన అన్నను హెచ్చరించాడు. అలాంటి సంబంధాలు పెట్టుకుని ఇంటి పరువు తీయొద్దని అన్నాడు. అయినా వెంకట సుబ్బయ్య తన తీరు మార్చుకోలేదు. దాంతో ఒకరోజు తమ్ముడు నాగార్జున తన అన్న ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు.
ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అతడికి ఇంటికెళ్లి గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఈ క్రమంలో వెంకట సుబ్బయ్యను.. నాగార్జున గట్టిగా నెట్టాడు. దాంతో అతను కింద పడిపోయాడు.
తలకు తీవ్రగాయం కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వెంకట సుబ్బయ్య చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాగార్జునను అదుపులోకి తీసుకున్నారు.