కల్కి 2898 ఏడీ సినిమా వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో.. థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఎన్నో రోజుల తర్వాత పెద్ద హీరో సినిమా థియేటర్స్‌లో రావడంతో.. ఈ చిత్రానికి మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. కల్కి 2898 ఇతర భాషల్లో సైతం పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.
ఈ చిత్రం మొదట్లో కనిపించిన కృష్ణుడి పాత్ర.. నటుడిని మాత్రం రివీల్ చేయలేదు సినిమా యూనిట్. దాంతో ఈ పాత్రలో నటించింది ఎవరు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో చర్చలు సాగాయి. అయితే ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో కనిపించింది మరెవరో కాదు.. కృష్ణ కుమార్. కృష్ణ కుమార్ ఒక తమిళ నటుడు.
ఈయన ఇంతకుముందు చాలా మంచి పాత్రల్లో తమిళ సినిమాలలో నటించారు. సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో కనిపించాడు. కాగా కల్కి చిత్రంలో అతని నటనకు వస్తున్న ప్రశంసల పట్ల సోషల్ మీడియాలో స్పందిస్తూ.. హర్షం వ్యక్తం చేశారు.