Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

Advertiesment
RGV in Kalki

సెల్వి

, గురువారం, 27 జూన్ 2024 (22:43 IST)
RGV in Kalki
సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ గురించి సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేదు. తరచుగా, అతను తన చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చేవాడు. పాటలు కూడా పాడాడు. ఇప్పుడు నటుడిగా అరంగేట్రం చేశాడు. గురువారం విడుదలైన ప్రభాస్ కొత్త చిత్రం కల్కి 2898 ADతో అతని నటుడి అరంగేట్రం జరిగింది.
 
ఆర్జీవీ ఈ చిత్రంలో రెండు నిమిషాలు కనిపించారు. చిన్న రోలైనప్పటికీ బిగ్ స్క్రీన్‌పై ఆయన నటన అదిరిపోయింది. 
ఈ సందర్భంగా కల్కి చిత్రంలో నాగ్ అశ్విన్‌కు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్జీవీ ఎక్స్‌లో పేర్కొన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంపై ప్రశంసలు కురిపించాడు.
 
"అమితాబ్ గతంలో కంటే 100 రెట్లు ఎక్కువ డైనమిక్, ప్రభాస్ మునుపెన్నడూ చూడని అవతార్‌లో ఉన్నారు. కల్కిలో నా నటనకు అరంగేట్రం ఇచ్చినందుకు ధన్యవాదాలు" అంటూ ఆర్జీవీ తెలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్