Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యానందను ఆడిపోసుకున్నారు.. త్వరలోనే కైలాస కంట్రీకి వెళ్తా : మీరా మిథున్

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (10:01 IST)
ఆధ్యాత్మిక ముసుగులో రాసలీలలు కొనసాగించి పోలీసులకు పట్టుబడి, బెయిలుపై విడుదలై పత్తాలేకుండా పారిపోయిన రాసలీలల స్వాములోరు నిత్యానందకు కోలీవుడ్ నటి మీరా మిథున్ అండగా నిలిచారు. అనవసరంగా నిత్యానందన్‌ను ఆడిపోసుకున్నారంటూ మండిపడింది. పైగా, తాను కూడా త్వరలోనే కైలాస దేశానికి వెళ్తానని ప్రకటించారు.
 
తమిళనాడు రాష్ట్రంలోని మదురైకు చెందిన నిత్యానంద.. తమిళ సినీ నటి రంజితతో రాసలీలలు జరుపుతున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు బెయిలుపై వచ్చిన ఆయన తొలుత నేపాల్‌కు వెళ్లి.. అక్కడ నుంచి నకిలీ పాస్‌పోర్టు ద్వారా కరేబియన్ దీవులకు వెళ్లిపోయారు. కరేబియన్ దీవుల్లోని ఓ దీవిని సొంతంగా కొనుగోలు చేసి.. దానికి 'రిపబ్లిక్ ఆఫ్ కైలాస' అని నామకరణం చేశారు.
 
ప్రస్తుతం ఈ దేశంలోనే నిత్యానంద స్వామి తన శిష్యగణంతో సేదతీరుతున్నారు. ఈ క్రమంలో ఈ దేశానికి ప్రత్యేక కరెన్సీ కోసం ఓ రిజర్వు బ్యాంకును ఏర్పాటు చేశారు. దీనికి కైలాస రిజర్వు బ్యాంకు అని పేరు పెట్టి, ఈ కరెన్సీ చెలామణి అయ్యేందుకు పలు దేశాలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వివాదాస్పద స్వామీజీ నిత్యానందపై కోలీవుడ్ నటి మీరామిథున్ ప్రశంసలు కురిపించింది. అందరూ కలిసి ఆయనను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. నిత్యానంద రోజురోజుకు మరింత శక్తిమంతంగా మారుతున్నారని పేర్కొంది. తాను త్వరలోనే నిత్యానంద కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నట్టు తెలిపిన నటి.. ‘లాట్స్ ఆఫ్ లవ్’ అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments