Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌ను ఇరికించిన నటి.. సామూహిక అత్యాచారం చేస్తారట.. చంపుతారట..! (Video)

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (10:31 IST)
Meera Chopra
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన రచ్చ.. ప్రస్తుతం ఆయన్నే ఇరికించినట్లైంది. సాధారణంగా సోషల్‌ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక సెలబ్రిటీలకి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. సంబంధం లేని విషయాలలో వారిని ఇరికిస్తూ ట్రోల్‌ చేస్తూ ఉంటారు.
 
తాజాగా నటి మీరా చోప్రాకి ఎన్టీఆర్‌ అభిమానుల నుండి వేధింపులు వచ్చాయి. అందుకు కారణం ఏమంటే చాట్‌ సెషన్‌లో తనకి ఫేవరేట్‌ హీరో మహేష్‌ బాబు అని చెప్పడమే. అంతేగాకుండా తాను ఎన్టీఆర్ అభిమానిని కాదని.. ఆయన గురించి తనకు తెలియదని చెప్పింది. దీంతో హర్ట్ అయిన జూనియర్ ఎన్టీఆఱ్ ఫ్యాన్స్ మీరా చోప్రాని ట్విట్టర్‌  వేదికగా ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. 
 
వెంటనే ఆమె సైబర్‌ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. నాపై ట్రోల్‌ చేసిన వారి ట్విట్టర్‌ అకౌంట్స్‌ తొలగించాలని కూడా కోరింది. అంతేకాక దీనిపై ఎన్టీఆర్‌ స్పందించాలని కూడా పేర్కొంది.
 
ఇక ఇలాంటి ట్వీట్లు రావడంతో విసుగెత్తిన మీరా చోప్రా.. ''ఒకరి ఫ్యాన్ కాకపోవడం అదేమైనా నేరమా? నాకు మాత్రం ఆ విషయం తెలీదు.. కానీ నేను మాత్రం ఓ విషయాన్ని అరిచి చెప్పాలనుకుంటున్నాను.. మీరు ఒక వేళ ఎన్టీఆర్ ఫ్యాన్ కాకపోతే మిమ్మల్ని రేప్ చేస్తామని, తల్లిదండ్రులను చంపుతామని బెదిరిస్తున్నారు. అలా అని ఆయన ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. వారంతా వారి హీరో పరువును తీస్తున్నారు" అంటూ చెప్పుకొచ్చింది.

ఇలాంటి ఫ్యాన్స్‌ వల్ల జూనియర్ ఎన్టీఆర్ మీరా చోప్రా విషయంలో చిక్కుకున్నట్లైంది. ప్రస్తుతం మీరా చోప్రాకి ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మద్దతు తెలిపింది. ఫ్యాన్స్ వేధింపులపై మండిపడింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments