హృతిక్‌కు పెళ్ళి అయిన రోజు నా గుండె బద్ధలైంది.. నటి మీనా

Webdunia
ఆదివారం, 17 మే 2020 (11:18 IST)
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పెళ్లి అయిన రోజున తన గుండె బద్ధలైపోయిందని సీనియర్ నటి మీనా వ్యాఖ్యానించింది. ఆ తర్వాత తేరుకుని, ఆయన విందు రిసెప్షన్‌కు వెళ్లినట్టు చెప్పుకొచ్చింది. 
 
కరోనా లాక్డౌన్‌తో ఇంటికే పరిమితమైన మీనా... అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుంది. తన ఫేవరెట్ హీరో హృతిక్ పెళ్లి తర్వాత బెంగళూరులో విందు కార్యక్రమంలో అతన్ని కలిశానని, ఆ రోజు తన గుండె బద్ధలైందని చెబుతూ ఓ నవ్వుతున్న ఎమోజీని ఆమె పోస్ట్ చేశారు. 
 
నాడు హృతిక్‌కు శుభాభినందనలు చెబుతున్న ఓ ఫోటోను ఆమె పోస్ట్ చేశారు. మీనా పోస్ట్‌ను చూసిన ఓ నెటిజన్, అజిత్ హీరోగా నటించిన 'విలన్' సినిమాలో మీరు చేసిన ఓ సాంగ్‌ను హృతిక్ చాలా మెచ్చుకున్నారని, ఆ ఆర్టికల్ ను తాను చదివానని చెప్పాడు.
 
దీనికి మీనా స్పందిస్తూ, మరో ఘటనను గుర్తుచేసింది. ఆ పాట షూటింగ్ మంచులో జరిగిందని ఆ సమయంలో హృతిక్‌తో పాటు అమితాబ్, కరీనా కపూర్‌లు కూడా అక్కడే ఉన్నారని, దట్టంగా మంచు కురుస్తుంటే షూటింగ్ ఆపకపోయేసరికి, తనకేం అవుతుందోనన్న ఆందోళనలో కరీనా తల్లి తనను తిట్టారని గుర్తుచేసుకున్నారు. 
 
కాగా, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు గత 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సినీ ఇండస్ట్రీకి ఇచ్చిన విందు కార్యక్రమానికి అపుడు సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న మీనా కూడా హాజరైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

నవంబర్ 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష రద్దు : తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments