Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాస్టింగ్ కౌచ్‌పై నటి మీనా ఏమన్నదో తెలుసా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని క్యాస్టింగ్ కౌచ్ వివాదం వీడేట్లు లేదు. నటి శ్రీరెడ్డి చేపట్టిన నిరసనపై పలువురు స్పందిస్తున్న నేపథ్యంలో.. నటి మీనా కూడా స్పందించింది. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (18:01 IST)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని క్యాస్టింగ్ కౌచ్ వివాదం వీడేటట్లు లేదు. నటి శ్రీరెడ్డి చేపట్టిన నిరసనపై పలువురు స్పందిస్తున్న నేపథ్యంలో.. నటి మీనా కూడా స్పందించింది. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక విచారకరమైన అంశమని మీనా వెల్లడించింది. తాము హీరోయిన్లుగా పనిచేసిన కాలంలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయని చెప్పింది. కానీ తనకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని చెప్పింది. 
 
వక్ర బుద్ధి కలిగిన మగాళ్లు ఇకనైనా మారాలని తెలిపింది. ఒక స్త్రీతో డీల్ చేసేముందు తమకు కూడా భార్య, పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించింది. తన కెరీర్‌లో తాను అగ్ర నటులందరితో నటించానని, అరవింద స్వామితో మాత్రం నటించలేకపోయానని మీనా తెలిపింది.
 
మరోవైపు వర్ధమాన నటి ప్రియ భవాని శంకర్ మరోసారి పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశాన్ని లేవనెత్తింది. బుల్లితెరపై ఇప్పటిదాకా సందడి చేసిన ప్రియ, ఇప్పుడిప్పుడే వెండి తెరపై బిజీ అవుతోంది. ఇటీవలే కార్తీకి జంటగా ఓ చిత్రంలో నటించింది. తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ.. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు నిజమేనని స్పష్టం చేసింది. ఈ వేధింపులు అన్ని రంగాల్లో ఉన్నాయని ప్రియ చెప్పింది.
 
అయితే, వాటిని అంగీకరించడం, నిరాకరించడం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపింది. లైంగిక వేధింపుల గురించి శ్రీరెడ్డి బహిరంగంగా చెప్పడం సరికాదని చెప్పింది. తప్పు చేసి, బయటకు చెప్పుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది. వేధింపుల బారిన పడకూడదనుకుంటే నటన నుంచి తప్పుకోవచ్చు కదా అని తెలిపింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం