Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వనీదత్‌, మెహర్‌ రమేష్‌ గురించే చర్చ.... 'మీలో ఎవరు కోటీశ్వరుడు'

ఇటీవలే విడుదలైన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సినిమాలో పృథ్వీ హీరోగా సినిమాలో నటించే సినిమా పేరు 'తమలపాకు'. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది రోల్డ్‌గోల్డ్‌ మహేష్‌.. ఈ పాత్రను రఘుబాబు పోషించాడు. చిత్ర నిర్మాతగా పోసాని నటించారు. ఈ ఇద్దరు పాత్రలు అశ్వనీదత్‌,

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (18:22 IST)
ఇటీవలే విడుదలైన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సినిమాలో పృథ్వీ హీరోగా సినిమాలో నటించే సినిమా పేరు 'తమలపాకు'. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది రోల్డ్‌గోల్డ్‌ మహేష్‌.. ఈ పాత్రను రఘుబాబు పోషించాడు. చిత్ర నిర్మాతగా పోసాని నటించారు. ఈ ఇద్దరు పాత్రలు అశ్వనీదత్‌, మెహర్‌ రమేష్‌లవేనని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీపై సెటైర్‌గా తీసిన ఈ సినిమాలో సినిమాలో జరిగే విషయాలనే ఎక్కువగా చర్చించారు. 
 
దర్శకుడు మెహర్‌ రమేష్‌.. తన తీసిన సినిమానే మళ్ళీ తిప్పి తీస్తూ ప్రయోగాలు చేశారు. కంత్రి, శక్తి.. వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ చిత్రాల దెబ్బతో అశ్వనీదత్‌.. మళ్ళీ సినిమా తీయకుండా కనుమరుగయ్యారు. ఒకప్పుడు అగ్ర హీరోలతోనే సినిమాలు తీస్తానని ప్రకటించిన దత్‌.. చివరికి మెహర్‌ రమేష్‌ దెబ్బకు.. దిగివచ్చాడు. ఆ తర్వాత గ్యాప్‌ తీసుకున్నా.. ఆయన కుమార్తెలు కొత్తవారితో సినిమాలు తీస్తున్నారు. 
 
ఇంతకీ మెహర్‌ రమేష్‌ కూడా ఎక్కడా అడ్రస్‌ లేడు. ఆయన తీసిన కంత్రి, శక్తి సినిమాలు డిజాస్టర్‌లు. కోట్లు ఖర్చు భారీగా పెట్టి సినిమా తీశాడు. అందుకు ఉదాహరణలుగా పోసాని ఓ సీన్‌లో చూపించాడు. కంత్రి సినిమాకు బదులు జంత్రి.. అని వీడియో షాప్‌లో డీవీడీలు రఘుబాబు కొంటాడు. వాటిని కలిపి మరో కొత్త కథ తయారుచేస్తాడు. కోట్లు ఖర్చుపెట్టి.. సరైన కథలు లేకుండా తీసే నిర్మాతకు ఈ చిత్రం కనువిప్పుగా వుంటుందని చర్చించుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments