Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనాడు గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీ రావు కన్నుమూత

సెల్వి
శనివారం, 8 జూన్ 2024 (07:40 IST)
Ramoji Rao
ఈనాడు గ్రూప్‌ ఛైర్మన్‌, తెలుగు మీడియా మొఘల్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నెల 5న అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో వైద్యులు స్టెంట్‌ను అమర్చారు. 
 
స్టెంట్ ప్రక్రియ తరువాత, అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయన ఆసుపత్రిలో చేర్చారు. 87 ఏళ్ల రామోజీరావు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గతంలో వైద్య చికిత్స పొందారు.
 
రామోజీ రావు తన మీడియా సామ్రాజ్యంతో పాటు అనేక వ్యాపారాలను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందారు. ఆయన ఈనాడు గ్రూప్, రామోజీ ఫిల్మ్ సిటీ, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్‌లను పర్యవేక్షించారు. ఆయన నాయకత్వంలో ఈనాడు తెలుగు మీడియాలో ప్రధాన శక్తిగా మారింది. 
 
ఇక రామోజీరావు మృతి పట్ల మీడియాతో పాటు సినీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. "ఎవ్వరికీ తలవంచని  మేరు పర్వతం .. దివి కేగింది" అంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. రామోజీరావు మృతి పట్ల ఆయన సానుభూతి వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

ఆర్ఆర్ఆర్ కేసు : విజయపాల్‌కు సుప్రీంకోర్టు షాక్...

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

పుష్ప 2 ను ఆడకుండా చేయాలని చూస్తున్నారు, నేను చూస్తాను: అంబటి రాంబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments