Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వర్మకు కత్రినా కైఫ్ థ్యాంక్స్.. ''అమ్మ'తో వర్మ.. ట్విట్టర్లో ఫోటో ఎందుకబ్బా?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బాలీవుడ్ కత్తి హీరోయిన్ కత్రినా థ్యాంక్స్ చెప్పింది. స్మితా పాటిల్ అవార్డు కత్రినాకు రావడంపై బాలీవుడ్‌లో మిశ్రమ స్పందనలు వచ్చిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ కత్రిన

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (18:47 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బాలీవుడ్ కత్తి హీరోయిన్ కత్రినా థ్యాంక్స్ చెప్పింది. స్మితా పాటిల్ అవార్డు కత్రినాకు రావడంపై బాలీవుడ్‌లో మిశ్రమ స్పందనలు వచ్చిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ కత్రినాకు వత్తాసు పలికాడు.

ఇందుకే అమ్మడు ప్రస్తుతం థ్యాంక్స్ చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో కత్రినా మాట్లాడుతూ, స్మితా అవార్డు కోసం తన పేరును ప్రకటించగానే భిన్నాభిప్రాయాలొచ్చాయని.. ముఖ్యంగా వర్మ తనకు మద్దతుగా నిలుస్తూ చేసిన ట్వీట్‌ను ఎప్పటికీ మరిచిపోనని వెల్లడించింది. 
 
వర్మ తనకు మద్దతుగా చేసిన వ్యాఖ్యల్లో చాలా నిజముందని కత్రినా చెప్పింది. వర్మ ట్వీట్‌లో తన గురించి చెప్పిన ప్రతి విషయం నిజమేనని.. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో తనకు డ్యాన్స్, యాక్టింగ్ గురించి బొత్తిగా తెలియదని ఒప్పుకుంది. ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాకే అవన్నీ నేర్చుకున్నానని చెప్పింది. అయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఇవన్నీ నేర్చుకుని రాణించడం గొప్ప విషయమే కదా అంటూ ప్రశ్నించింది.  
 
ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ గోపాల్ వర్మ తమిళనాడు సీఎం జయలలితపై పడ్డాడు. కొన్ని రోజుల క్రితం పింక్ సినిమా, కత్రినా కోసం మాట్లాడిన వర్మ.. నయీమ్ అనుచరులు తనను బెదిరిస్తున్నారని కామెంట్ చేశాడు. ప్రస్తుతం జయలలిత అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఆమె దగ్గర నుంచి ఏదో అవార్డు తీసుకుంటున్నట్లు గల ఫోటోను ఒకటి షేర్ చేశాడు.

అంతేకాకుండా "అమ్మల అమ్మ... అమ్మతో నేను.." అంటూ ఒక ఫోటోను షేర్ చేశాడు. ఓ వైపు కావేరీ జలాల వివాదం జరుగుతుంటే.. మరోవైపు అమ్మ అనారోగ్యం పాలైన తరుణంలో ఈ ఫోటోను వర్మ ఎందుకు పోస్ట్ చేశాడోనని నెటిజన్లు తలపట్టుకుంటున్నారు.

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments