Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మీలో ఎవరు కోటీశ్వరుడు'' నాగార్జున అవుట్... మెగాస్టార్ చిరంజీవి ఇన్.. ఎందుకో తెలుసా?

అక్కినేని నాగార్జున నిర్వహిస్తున్న ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోను నాగార్జున అద్భుతంగా రన్ చేశారు. ఇక నాలు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (18:25 IST)
అక్కినేని నాగార్జున నిర్వహిస్తున్న ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోను నాగార్జున అద్భుతంగా రన్ చేశారు. ఇక నాలుగో సీజన్‌లో మెగా స్టార్ చిరంజీవి ఆ బాధ్యతలను తీసుకుంటున్నారు. తద్వారా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై కనిపించబోతున్నారు. 
 
మెగాస్టార్‌గా కొనసాగుతూ ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వెళ్లిన మెగాస్టార్ కాంగ్రెస్ పాలనలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఆపై పది సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం వీవీ వినాయక్ దర్శకత్వంలో 'ఖైదీ నెం.150' చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాపులర్ ప్రోగ్రాం మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా కోట్లాది హృదయాలను కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నారు.
 
తాజాగా చిరంజీవిపై ఫోటో షూట్ జరిగింది. ఇంకా నాలుగో సీజన్‌పై చిన్న ప్రోమో విడుదల చేశారు. ఇంకేముంది.. త్వరలో చిరంజీవి కోటీశ్వరుడి షో మెరవనున్నారని మెగా ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.
 
ఇకపోతే నాగార్జున ఈ ప్రోగ్రామ్ నుంచి తప్పుకోవడానికి కారణాలున్నాయని సినీ జనం అంటున్నారు. ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్‌లకు వివాహ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో పెళ్ళి పనుల్లో బిజీగా ఉండటంతో ఈ ప్రోగ్రామ్‌ నుంచి తప్పుకున్నట్లు చెప్తున్నారు. పెళ్ళి పనులు పూర్తయ్యాకే ఈ ప్రోగ్రామ్ గురించి ఆలోచించే అవకాశం ఉంటుందని నాగ్ సన్నిహితులు చెప్తున్నారు. 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments