Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ కాన్సెప్ట్‌తో మాయా పేటిక చిత్రం

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (08:33 IST)
Viraj Ashwin, Payal Rajput
విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలకు సన్నద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి   ‘షన్న షన్న..’ అనే లిరికల్  సాంగ్‌ను ..హైద‌రాబాద్ బ‌షీర్ బాగ్‌లోని సెయింట్ జోసెస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కాలేజ్ స్టూడెంట్స్ న‌డుమ ఈ ల‌వ్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. సాంగ్‌కి స్టూడెంట్స్ నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. గుణ బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్ సంగీతం అందించిన ఈ పాట‌ను శ్రీమ‌ణి రాయ‌గా.. య‌శ‌స్వి కొండెపూడి, ప్ర‌జ్ఞ నాయ‌ని పాడారు. ఈ సంద‌ర్భంగా...
 
హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ‘‘‘థాంక్యూ బ్రదర్’ సినిమా తర్వాత నేను నటించిన చిత్రమిది.  ప్రేక్షకుల నుంచి మళ్లీ నేను అంతే ప్రేమను ఎదురు చూస్తున్నాను.  ప్రస్తుతం మన జీవితం మన చేతుల్లో కాకుండా.. ఎక్కువగా సెల్ ఫోన్‌లోనే ఉంటుంది. అలాంటి మొబైల్ కాన్సెప్ట్‌తో సినిమా ఇది.  నేను ఎంతో ఇష్టపడి చేసిన పాత్ర ఇది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మంచి క్యారెక్టర్ క్రియేట్ చేసి.. అందులో నాకు అవకాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు ర‌మేష్‌గారికి, నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు.
 
డైరెక్టర్ రమేష్ రాప‌ర్తి మాట్లాడుతూ ‘‘మాయ పేటిక’ సినిమా స్కిప్ట్ సరికొత్తగా ఉంటుంది. సెల్ ఫోన్ ఆధారంగా ఈ స్క్రిప్ట్ రూపొందించాం. మీ సెల్ ఫోన్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఈ సినిమాలోనూ మంచి విజువల్స్, మంచి సాంగ్స్, మంచి కామెడీ ఉన్నాయి. ఫుల్ ప్యాకేజీ సినిమా ఇది.  నన్ను నమ్మిన నిర్మాతలు శరత్, తారక్‌లకు..సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ అందరికీ థ్యాంక్స్’’  అన్నారు.
 
నిర్మాతలు మాట్లాడుతూ ‘‘రొటీన్‌కి భిన్నంగా సినిమా తీయాలని అనుకున్నాం. కరోనా సమయంలో థ్యాంక్ యూ బ్రదర్ మూవీ ద్వారా కొత్త కథను, కొత్త సినిమాను మీ ముందుకు తీసుకువచ్చాం. మీరిచ్చిన ధైర్యంతో రెండో సినిమా మాయ పేటికను నిర్మించాం. ఇదొక సెల్‌ఫోన్ బేస్ ఆధారంగా తీశాం. ఈ సినిమాకు సహకరించిన నటీనటులు, డైరెక్టర్ రమేష్ అందరికీ థ్యాంక్స్. త్వరలోనే రిలీజ్ అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments