Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరణ్‌ అబ్బవరం హీరోగా మాస్‌ ఎంటర్‌టైనర్‌ మీటర్‌

Webdunia
గురువారం, 2 మార్చి 2023 (10:11 IST)
Kiran Abbavaram, Mete
ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీటర్‌’. మై*త్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో  క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్‌ కాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 7న వేసవిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. 
 
ఈ  సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ కిరణ్‌ అబ్బవరంతో నిర్మిస్తున్న పక్కా కమర్షియల్‌ సినిమా ఇది. ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరం పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఆయన లుక్‌, పాత్ర అన్ని కొత్తగా వుంటాయి. ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. ఏప్రిల్‌ 7న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు. 
 
అతుల్య రవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్‌, డీఓపీ: వెంకట్‌.సి.దిలీప్‌ అండ్‌ సురేష్‌ సారంగం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: జేవీ, సంభాషణలు: రమేష్‌ కాదూరి, సూర్య, లైన్‌ ప్రొడ్యూసర్‌: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాబా సాయి, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత : బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సురేష్‌ కందులు, మార్కెటింగ్‌: ఫస్ట్‌ఫో, పబ్లిసిటి:మ్యాక్స్‌ మీడియా, పీఆర్‌ఓ : వంశీ శేఖర్‌, మడూరి మధు, సమర్పణ: నవీన్‌ ఎర్నేనీ, రవి శంకర్‌ యలమంచిలి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రమేష్‌ కాదూరి,

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments