Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కుమారుడి పేరు..''మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల''.. వర్మ సెటైర్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడో సతీమణి అన్నా ఇటీవలే ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకు పవన్ కల్యాణ్ వైవిధ్యమైన పేరు పెట్టారు. ఈ పేరే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పేరే

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (08:59 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడో సతీమణి అన్నా ఇటీవలే ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకు పవన్ కల్యాణ్ వైవిధ్యమైన పేరు పెట్టారు. ఈ పేరే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పేరేంటో తెలుసా? ''మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల''. ఈ పేరు వినడానికి.. కొంత వింతగా వున్నా.. ఈ పేరులో ఉన్న అర్థమేమిటి అనే దానిపై సోషల్ మీడియా చర్చ సాగుతోంది. 
 
పవన్ సతీమణి అన్నా లెనిజోవా సంప్రదాయాలకు పెద్దపీట వేస్తోంది. రష్యన్ ఆర్థోడక్స్ మత సంప్రదాయాలను పాటించే ఆమె తన బిడ్డ పేరు కూడా సంప్రదాయబద్ధంగానే ఉండాలని భావించిందట. అందుకే క్రైస్తవంలో "మార్కస్" అనే దేవుడికి సంక్షిప్త రూపంగానే తన బిడ్డ పేరుకు మొదట ‘మార్క్’ అని, చిరంజీవి అసలు పేరు నుంచి "శంకర్"ను, పవన్ పేరు నుంచి "పవనోవిచ్".. వీటిన్నింటినీ కూర్చి "మార్క్ శంకర్ పవనోవిచ్" అనే పేరు పెట్టారని తెలుస్తోంది. పవన్ కుమార్తెకు కూడా పొలెనా అంజనా పవనోవా అని పేరు పెట్టారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్, అన్నా దంపతుల సంతానం.. వారి పేర్లపై పెద్ద చర్చ సాగుతోంది. 
 
మరోవైపు పవన్ కుమారుడి పేరును విన్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిపై నోటికి పనిచెప్పారు. భాషలు పుట్టిన తర్వాత, నాగరికతలు మొదలైన తర్వాత కూడా ఇంతటి గొప్ప పేరు వినలేదని ఆర్జీవీ ఫేస్‌బుక్‌లో సెటైర్ వేశారు. పవన్ కల్యాణ్ తనయుడి పేరు ముందు తను తలవంచుతున్నానని ఆర్జీవీ వ్యాఖ్యానించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments